పుష్పరాజ్ రియల్ ఐకానిక్ సూపర్‌హీరో: కింగ్ నాగార్జున
పుష్ప- పుష్ప 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు 2100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఒక సంచలనం.
పుష్ప- పుష్ప 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు 2100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఒక సంచలనం. అయితే ఈ సంచలనానికి కారణమేమిటో ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత కింగ్ నాగార్జున పుష్ప ఫ్రాంఛైజీ విజయం వెనక అసలు కారణాలను విశ్లేషించారు.
పుష్ప రాజ్ ఇంతటి ప్రజాదరణ పొందడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు.. నాగార్జున తన వ్యూస్ ని షేర్ చేసారు. పుష్ప రాజ్ ఒక `సూపర్ హీరో పాత్ర`గా.. ఐకానిక్ పాత్రగా మారాడని నాగ్ అన్నారు. దీని కారణంగా ఈ పాత్ర సోషల్ మీడియాలో గొప్ప ప్రజాదరణ పొందింది. ``పుష్ప రాజ్ సూపర్ హీరో పాత్రగా మారిపోయాడు. అతడు చాలా చాలా ఐకానిక్. మీమ్స్ లో, స్పూఫ్ లోను ప్రతిచోటా పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్. ఆ పాత్ర అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి కేవలం కథ ఇక్కడ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది`` అని నాగార్జున అన్నారు.
ఏ సినిమా దేశవ్యాప్తంగా పంపిణీకి అర్హమైనది .. ఏది కాదు? అనేది అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా నిర్ణయిస్తుంది? అని ప్రశ్నించగా, పుష్ప 2, ఆర్.ఆర్.ఆర్ గురించి నాగ్ ప్రస్థావించారు. కథ ప్రకారం సినిమా తీస్తాం. అది పుష్ప అయినా లేదా ఇటీవల విడుదలైన ఏదైనా సినిమాని తీసుకోండి.. స్థానికత గురించి ఆలోచిస్తాను. ఇక్కడ పుట్టి పెరిగిన డిఎన్.ఏ నుండి సినిమా వచ్చింది. కాబట్టి దర్శకులు కూడా అలాంటివారే. RRR అయితే అది పూర్తిగా తెలుగు సినిమాగానే చేశారని నేను అనుకుంటున్నాను.. అందులో అజయ్ దేవగన్ నటించడం ఉత్తర భారతదేశంలో ఈ సినిమా బాగా ఆడటానికి మరో కారణం అని నాగ్ అన్నారు. తెలుగు మాట్లాడే ప్రేక్షకులు ఏ మంచి సినిమానైనా ఆదరిస్తారు. కాంతారా, RRR లేదా మార్వెల్ సినిమా అయినా ఆదరిస్తారని నాగార్జున అన్నారు. అక్కినేని కుటుంబ యాజమాన్యంలోని చలనచిత్ర నిర్మాణ పంపిణీ సంస్థ `అన్నపూర్ణ స్టూడియోస్` 50వ వార్షికోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేసారు.