ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ : నాగార్జున
ప్రతి హీరోకి కెరీర్ లో ఒక సినిమా పడుతుంది. ఆ సినిమాని గుర్తించి దాని కోసం ప్రాణం పెట్టేస్తే దానికి రావాల్సిన గుర్తింపు సక్సెస్ వస్తుంది.
ప్రతి హీరోకి కెరీర్ లో ఒక సినిమా పడుతుంది. ఆ సినిమాని గుర్తించి దాని కోసం ప్రాణం పెట్టేస్తే దానికి రావాల్సిన గుర్తింపు సక్సెస్ వస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య ఆ లైన్ లోనే ఉన్నాడు. తండేల్ సినిమా సైన్ చేసినప్పుడే ఇదేదో గట్టిగా వర్క్ అవుట్ అయ్యేలా ఉందని గుర్తించిన నాగ చైతన్య తనను తాను పాత్ర కోసం మలచుకుని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మామూలుగా సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కామన్. కానీ తండేల్ చూసిన వారికి సాయి పల్లవికి ఏమాత్రం తగ్గకుండా చేశాడని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
తండేల్ రిలీజై సక్సెస్ సాధించింది. ఐతే చైతు కెరీర్ లోనే ఈ సినిమాకు వచ్చినంత బ్లాక్ బస్టర్ టాక్ మరే సినిమాకు రాలేదు. ఐతే ఈ టైం లో కింగ్ నాగార్జున ఏంటి సైలెంట్ గా ఉన్నాడని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఐతే ఇలా అనుకుంటున్నారో లేదో కరెక్ట్ టైంకి తన ట్వీట్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. తండేల్ సినిమా గురించి లేటెస్ట్ గా కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని రాసుకొచ్చారు అంటే ప్రియమైన నాగ చైతన్య నిన్ను చూసి గర్వపడుతున్నా తండేల్ ఇది ఏదో సాధారణ చిత్రం కాదు.. ఇది నీ కృషికి నిదర్శనం.. అక్కినేని అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్ విజయం మాతో పాటు మీది కూడా. మీ అంతులేని ప్రేమకు ధన్యవాదాలు.
అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసుకి బిగ్ బిగ్ థాంక్స్. అద్భుతమైన ప్రతిభావంతులైన సాయి పల్లవి మీరు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మేధావి దేవి శ్రీ ప్రసాద్ మీరు రాక్.. ఇంకా రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటికి అతని టీం మర్చిపోలేని విధంగా తండేల్ ని ఇచ్చారు అంటూ పెట్టారు.
నాగార్జున ట్వీట్ తో అక్కినేని ఫ్యాన్స్ మరింత సంతోషంగా ఉన్నారు. ఐతే తండేల్ టీం గురించి నాగార్జున చెప్పిన ప్రతి మాట నిజమే అని చెప్పాలి. చైతన్య నిజంగానే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం అందరి కష్టంతో ఈ సినిమా ఇంత గొప్ప సక్సెస్ ని అందుకుంది. తండేల్ సినిమా సక్సెస్ తో అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది.