అక్కినేని కాంపౌండ్ లో విశ్వంభ‌ర‌!

`కుభేర‌`, `కూలీ` త‌ర్వాత అక్కినేని నాగార్జున సోలో ప్రాజెక్ట్ ద‌ర్శ‌కుడి విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-26 17:30 GMT

`కుభేర‌`, `కూలీ` త‌ర్వాత అక్కినేని నాగార్జున సోలో ప్రాజెక్ట్ ద‌ర్శ‌కుడి విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని సంగ‌తి తెలిసిందే. త‌మిళ డైరెక్ట‌ర్ న‌వీన్ తో సినిమా ఉంటుంద‌ని కొన్ని నెల‌లుగా ప్రచార జ‌రుగుతోంది గానీ ఇంత‌వ‌ర‌కూ దాని గురించి అధికారికంగా ఎలాంటి స‌మాచారం నాగ్ ఇవ్వ‌లేదు. అలాగే కొన్ని క‌థ‌లు కూడా విన్నారు. వాటి గురించి ఎక్క‌డా నాగ్ రివీల్ చేయ‌లేదు. దీంతో స్టోరీలు..క‌థ‌ల విష యంలో నాగార్జున ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని క్లారిటీ వ‌స్తుంది.

అయితే తాజాగా అక్కినేని కాపౌండ్ లోకి యువ ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట ఎంట‌ర్ అయిన‌ట్లు స‌మాచారం. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో నాగార్జున‌తో వ‌శిష్ట భేటీ అయ్యాడు. నాగార్జున‌కు ఓ స్టోరీ వినిపించి వ‌చ్చిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితుల నుంచి తెలిసింది. ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ అని...రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రా ల‌కు దూరంగా ఉండే స్టోరీ అని అంటున్నారు. అయితే నాగార్జున నుంచి ఇంకా గ్రీన్ సిగ్నెల్ రాలేదుట‌.

ఆయ‌న నుంచి స‌మాధానం రావ‌డానికి మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌స్తుతం వ‌శిష్ట మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `విశ్వంభ‌ర` అనే సోషియా ఫాంట‌సీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. చిత్రీక‌ర‌ణ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాకి సీజీ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా సీజీతో ప‌ని లేకుండా వ‌శిష్ట కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలె క్కించాల‌నుకుటున్నారు. ఈ నేప థ్యంలోనే నాగార్జున‌కు వ‌శిష్ట స్టోరీ వినిపించిన‌ట్లు తెలుస్తోంది. హీరోలంతా బిజీగా ఉన్నారు. సీనియ‌ర్ హీరోల్లో వెంక‌టేష్‌, నాగార్జున‌లు మాత్ర‌మే దొరుకుతున్నారు. బాల‌య్య కు ఉండాల్సిన లైన‌ప్ ఎలాగూ ఉంది. అందుకే వ‌శిష్ట నాగ్ ని లైన్ లో పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News