కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో కింగ్!
ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు ను పురస్కరించుకుని విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారని తెలిసింది.
'ది ఘో స్ట్' తర్వాత కింగ్ నాగార్జున కొత్త సినిమా విషయంలో నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకనొచ్చినా? దానిపై మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున కొత్త దర్శకుడితో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చర్చలు ముగించినట్లు తెలిసింది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ అయిందని సమాచారం. 'నా సామిరంగ' అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు లీకైంది.
ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు ను పురస్కరించుకుని విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారని తెలిసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు అక్కినేని వర్గాల నుంచి తెలుస్తోంది. ఇందులో నాగార్జునకు జోడీగా ఇద్దరు కథానాయికల్ని తీసుకుంటున్నారుట. సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారుట. అక్కినేని అభిమానులకు నాగార్జున సరైన హిట్ ఇచ్చి చాలా కాలమవుతుంది. ది ఘోస్ట్ కంటే ముందు 'బంగార్రాజు'లో నటించారు.
ఆ సినిమా బాగానే ఆడింది. అంతకు ముందు వైల్డ్ డాగ్ లాంటి వైవిథ్యమైన ప్రయత్నం విమర్శకుల ప్రశంసలు తెచ్చి పెట్టింది కానీ...కాసులు తీసుకురాలేదు. అంతకు ముందు చేసిన కొన్ని జానర్ సినిమాలు నాగ్ రేంజ్ హిట్ ని అందుకున్నవి కావు. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీస్‌ని మోతెక్కించే హిట్ పడలేదు. అలాంటి సక్సెస్ కోసం నాగార్జున వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన రేంజ్ లో రిజల్ట్ రావడం లేదు. మరి తాజా దర్శకుడైనా? కింగ్ కి ఆ రేంజ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
అటు తనయులు నాగచైతన్య..అఖిల్ కూడా రేసులో కాస్త వెనుకబడ్డట్లే కనిపిస్తోంది. చైతన్య నటించిన సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. 'కస్టడీ' పై భారీ అంచనాలు పెట్టుకున్నా నీరు గార్చింది. అలాగే అఖిల్ 'ఏజెంట్' తో రేంజ్ మారిపోతుందని ఆశించాడు. కానీ అతని కెరీర్ ని ఆ సినిమా అంతకంతకు వెనక్కి నెట్టింది. దీంతో మళ్లీ అలాంటి తప్పిదాలు దొర్లకుండా ఈసారి తండ్రి సూచనలు..సలహాలతో ముందుకెళ్తున్నట్లు సమాచారం.