నాగ శౌర్య హై బడ్జెట్.. ఫస్ట్ టైమ్ ఇలా..
ఈ ప్రాజెక్ట్ నాగ శౌర్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తన కెరీర్లో మరో కీలకమైన అడుగు వేస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల తర్వాత, ఈసారి పెద్ద సక్సెస్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. నాగ శౌర్య తాజా ప్రాజెక్ట్ డెబ్యూ డైరెక్టర్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ నాగ శౌర్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. పాన్-ఇండియా కథకు తగిన విధంగా ఈ సినిమా ఉంటుందని, అది ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది.
ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ రమేష్‌తో నాగ శౌర్య గత ఏడేళ్లుగా ట్రావెల్ అవుతున్నారట. మొదట ఈ కథ కోసం పాన్-ఇండియా హీరో కోసం పరిశీలన చేసినా, చివరకు రమేష్ స్నేహితుడైన నాగ శౌర్యనే కథకు సరిగ్గా సరిపోతారని భావించి ప్రధాన పాత్రలో ఎంపిక చేశారు. దర్శకుడిగా రమేష్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవీఎస్ చౌదరి, శ్రీను వైట్ల వంటి ప్రముఖుల వద్ద పని చేసిన అనుభవం ఉంది.
ఈ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లూరు కెమెరామెన్ గా వర్క్ చూస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్, చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కళా విభాగం బాధ్యతలు రాజీవ్ నాయర్, ఎడిటింగ్ పనులు కోటగిరి వెంకటేశ్వరరావు చేతుల్లో ఉన్నాయి.
ఇక, ఈ సినిమాలో సముతిరకని, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపీ, శ్రీదేవి విజయకుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై నాగశౌర్య భారీ ఆశలు పెట్టుకున్నారు. రెగ్యులర్ గా కాకుండా యూనివర్సల్ పాయింట్ ను సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే విడుదల డేట్ పై టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.