నాగ్ అశ్విన్ మామూలోడు కాదండోయ్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ''కల్కి 2898 AD''

Update: 2024-06-26 17:10 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ''కల్కి 2898 AD''. హిందూ పురాణాలకు సైన్స్ తో కలుపుతూ హాలీవుడ్ రేంజ్ లో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు. యావత్ సినీ అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్న ఈ సినిమా గురువారం (జూన్ 27) గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నారు.

* నాగ్ అశ్విన్ పూర్తి పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. ముద్దుగా అందరూ 'నాగి' అని పిలుస్తుంటారు. జయరామ్ రెడ్డి, జయంతి దంపతులకు 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. అతని సోదరి నిఖిలా రెడ్డి కూడా డాక్టరే. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వ్యవస్థాపకుడు డి. నాగేశ్వర రెడ్డికి వీరికి చాలా దగ్గరి బంధువు.

* బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న నాగ్ అశ్విన్.. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవారు. చదువుల్లో టాప్ టెన్ ర్యాంకర్లలో ఒకరిగా నిలిచేవారు. విద్యార్థి దశలోనే అతను స్కూల్‌ మ్యాగజైన్‌ కు ఎడిటర్‌ గా స్టోరీలు, వ్యాసాలు రాసేవాడట. హీరో రానా దగ్గుబాటి ఈయనకు క్లాస్‌ మేట్ అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.

* ఇంట్లో అంతా డాక్టర్లే ఉన్నా, నాగ్ అశ్విన్ మనసు వైద్య విద్య వైపు వెళ్ళలేదు. అందరిలాగా మెడిసన్‌ చేయకుండా, మణిపాల్ యూనివర్సిటీలో చేరి మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసాడు. వీడియో ఎడిటింగ్‌ పై పట్టు సాధించాడు.

Read more!

* తల్లి ప్రోత్సాహంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయడానికి ముందుగా శేఖర్‌ కమ్ముల దగ్గరకు వెళ్ళారు. 'గోదావరి' సినిమాతో బిజీగా ఉన్న కమ్ముల.. తర్వాతి ప్రాజెక్టుకు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే అప్పటిదాకా వెయిట్ చెయ్యలేక, మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' సినిమాకు ఏడీగా జాయిన్ అయిపోయారు. తొలి సంపాదనగా రూ. 4 వేలు అందుకోవడంతో అతని కెరీర్ ప్రారంభమైంది.

* శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లీడర్‌' సినిమాకు నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేశారు నాగ్ అశ్విన్. ఆ తర్వాత 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రానికి పని చేశారు. ఆయన వర్క్ చేసిన మూడు చిత్రాల్లో గుర్తింపు లేని చిన్న పాత్రలలో నటించాడు నాగి.

* 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' తర్వాత నాగ్ అశ్విన్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసిన నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న అతనికి సినిమా ఆఫర్ ఇచ్చారు. పలు కథల మీద వర్క్ చేసిన తర్వాత, చివరకు 'ఎవడే సుబ్రమణ్యం' స్క్రిప్టును ఫైనలైజ్ చేశారు. 2015లో నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా తెరకెక్కించి ఈ చిత్రంతోనే నాగి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నాని పాత్ర కోసం ముందుగా నవీన్‌ పొలిశెట్టిని ఎంపిక చేశారనే విషయం చాలామందికి తెలియదు.

4

* స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేసి, దాన్నే మౌంట్ ఎవరెస్ట్‌గా చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీయాలన్న సంకల్పంతోనే ఎంతో శ్రమించి హిమాలయాల్లో 'ఎవడే సుబ్రమణ్యం షూటింగ్ చేశారు నాగ్ అశ్విన్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టు మీద, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఇది ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాగికి నంది అవార్డు తెచ్చిపెట్టింది.

* 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా టైంలో స్నేహితులుగా మారిపోయిన నాగ్ అశ్విన్ - ప్రియాంక దత్ లు 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఫస్ట్ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరైన రిషి పేరునే తన కొడుక్కి పెట్టుకున్నారు.

* మొదటి సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన తర్వాత, మూడేళ్ల గ్యాప్ తీసుకొని 2018లో 'మహానటి' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకుంది. దీంతో నాగ్ అశ్విన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది.

* 2021లో నెట్ ఫ్లిక్స్ కోసం 'పిట్ట కథలు' అనే ఆంథాలజీ డ్రామాలోని X సెగ్మెంట్‌కు దర్శకత్వం వహించడం ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టారు నాగి. దీనికి ఆడియెన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే ఏడాది నిర్మాతగా మారి నవీన్ పొలిశెట్టితో 'జాతి రత్నాలు' చిత్రాన్ని రూపొందించారు.

* ప్రభాస్ హీరోగా 2020 ఫిబ్రవరిలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 'కల్కి 2898 AD' చిత్రాన్ని ప్రకటించారు నాగ్ అశ్విన్. ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు ఏడాది సమయం తీసుకొని, 2021 జూలైలో సెట్స్ మీదకు వెళ్ళారు. ఫ్యూచర్ వరల్డ్ ని ఆవిష్కరించే, ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కోసం రూ. 600 కోట్లకి పైగా ఖర్చు చేశారు. IMAX, 2D, 3D, 4DX ఫార్మాట్‌లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

* నాగ్ అశ్విన్ ఇప్పటి వరకూ తీసిన మూడు చిత్రాల్లోనూ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, మాళవిక అయ్యర్ భాగమయ్యారు. 'మహానటి'లో నటించిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కనిపిస్తారని టాక్.

Tags:    

Similar News