ఈ యుగంలో అతి పెద్ద బాక్సాఫీస్ స్టార్

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు.

Update: 2024-07-03 13:49 GMT

ప్రభాస్ నటించిన "కల్కి 2898 AD" బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి వారం ముగిసేలోపే రూ. 550 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, ఆ తరువాత కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ సాగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు.


దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు, ఈ విజయం అంతా ప్రభాస్ కృషే అని పేర్కొన్నారు. "ఇక్కడ సింపుల్ గా కూర్చున్న ఈ వ్యక్తే ఈ విజయానికి కారణం, ఈ యుగంలో అతి పెద్ద బాక్సాఫీస్ స్టార్. మా ప్రొడక్షన్ కి చేయగలిగిన ధైర్యాన్ని ఇచ్చారు, నాకు కావాల్సిన స్వేచ్ఛను ఇచ్చారు.

ఆయన ఇచ్చిన తెలివైన సూచనలు ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. అందరి డార్లింగ్, మా భైరవ, ఇప్పుడు ప్రపంచం కే ఉన్న K" అంటూ నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ప్రభాస్ ని ఈ యుగంలో అతి పెద్ద బాక్సాఫీస్ స్టార్ గా పిలవడం కచ్చితంగా అతిశయోక్తి కాదు, ఎందుకంటే ప్రభాస్ నిత్యం పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కానీ, ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించిన విషయం అతని వ్యాఖ్యల చివరి భాగం. నాగ్ అశ్విన్ "K" అని ప్రస్తావించడం ప్రభాస్ నటించిన పాత్రకు సంబంధించినదా? లేక రెండవ భాగంలో కల్కి పాత్రలో కనిపించనున్నాడా అనే అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది.బహుశా కింగ్ అని నాగ్ అశ్విన్ అలా హింట్ ఇచ్చి ఉంటాడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కల్కి 2898 AD కి వచ్చిన స్పందన చూస్తుంటే, ఈ చిత్రం భారతీయ సినిమాకి ఒక కొత్త దిశను సూచిస్తోంది.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ మరియు పౌరాణిక అంశాలను కలగలిపి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్ర విజయంతో ప్రభాస్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఆయన ఇప్పటికీ పెద్ద సినిమాలతో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఒక పండగలా మారింది. భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకా ఎంతమేరకు రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News