అర్షద్ వార్సీ.. పద్ధతిగా నాగ్ అశ్విన్ సమాధానం
దీనిపై కల్కి 2898ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అయితే అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ఆయన సీరియస్ గా రియాక్ట్ కాలేదు. సాఫ్ట్ గా తన పద్ధతిలో నాగ్ అశ్విన్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కల్కి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ లా ఉందంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు. మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు కూడా అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. తెలుగు సినిమా అభిమానులని అవమానించే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.
ఇక అర్షద్ వార్సీ విమర్శలపై టాలీవుడ్ సినీ అభిమానులు తిరిగి కౌంటర్లు ఇవ్వడంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ వివాదం మొదలైంది. అలాగే నార్త్, సౌత్ సినిమా అంటూ వేరియేషన్ చేసి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అర్షద్ వార్సీ కామెంట్స్ ని కోట్ చేస్తూ ఓ అభిమాని నాగ్ అశ్విన్ ని రియాక్ట్ అవ్వాల్సిందిగా కోరారు.
దీనిపై కల్కి 2898ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అయితే అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ఆయన సీరియస్ గా రియాక్ట్ కాలేదు. సాఫ్ట్ గా తన పద్ధతిలో నాగ్ అశ్విన్ కామెంట్స్ చేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లలేం కదా… నార్త్ - సౌత్, బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ గొడవ ఇక ఆపేయండి. అందరం కళ్ళు ఇంకా పెద్దవి చేసి చూడాలి. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగానే అందరూ గుర్తించాలి.
అర్షద్ సాబ్ విమర్శించడానికి సరైన పదాలు ఎంచుకొని ఉంటే బాగుండేది. అయిన ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ ని గిఫ్ట్స్ గా పంపిస్తున్నాను. కల్కి 2898ఏడీ పార్ట్ 2 కోసం కష్టపడి పనిచేస్తా. ప్రభాస్ ని మరింత బెటర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.
నాగ్ అశ్విన్ రియాక్ట్ అయిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా పరిణితితో దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. తప్పుగా విమర్శలు చేసిన కూడా అర్షద్ వార్సీ కామెంట్స్ ని నాగ్ అశ్విన్ రిసీవ్ చేసుకొని కల్కి పార్ట్ 2లో ప్రభాస్ ని గొప్పగా చూపిస్తానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అని కొనియాడుతున్నారు.
అర్షద్ వార్సీ వ్యాఖ్యల నేపథ్యంలో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ గొడవకి ముగింపు కార్డు పెట్టాలని కోరారు. మరి ఆయన వ్యాఖ్యలకి పరిగణంలోకి తీసుకొని ఈ వివాదానికి ముగింపు చెబుతారా లేదా అనేది వేచి చూడాలి.