ఆ రోల్ తారక్ కు బాగా సూటవుతుంది: బాలయ్య

రీసెంట్ గా డాకు మహారాజ్ టీమ్ సందడి చేయగా.. బాబీ ఇప్పటి వరకు పనిచేసిన హీరోల గురించి చెప్పమని కొన్ని పిక్స్ ను చూపించారు.

Update: 2025-01-07 06:15 GMT

నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరుగుతోందని ఎప్పటి నుంచో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు సంబంధించి రెండు ఎపిసోడ్స్ లో తారక్ పేరును ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొద్ది రోజుల క్రితం లక్కీ భాస్కర్ టీమ్ షోకు రాగా.. నిర్మాత నాగవంశీ అన్ స్టాపబుల్ మూమెంట్స్ గురించి బాలయ్య ప్రస్తావించారు. ఆ సమయంలో అజ్ఞాతవాసి పెద్ద ఫ్లాప్ అయిన తర్వాత వచ్చిన సినిమాల కోసం మాట్లాడారు. తారక్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పేరు చెప్పకుండా డైరెక్ట్ గా బన్నీ అల వైకుంఠపురములో నేమ్ చెప్పారు.

రీసెంట్ గా డాకు మహారాజ్ టీమ్ సందడి చేయగా.. బాబీ ఇప్పటి వరకు పనిచేసిన హీరోల గురించి చెప్పమని కొన్ని పిక్స్ ను చూపించారు. అందులో రవితేజ (పవర్), పవన్ కళ్యాణ్ (సర్దార్ గబ్బర్ సింగ్), వెంకటేష్- నాగచైతన్య (వెంకీ మామ), చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలయ్య (డాకు మహారాజ్) గురించి బాబీ మాట్లాడారు. కానీ అక్కడ ఎన్టీఆర్ (జై లవకుశ) గురించి ప్రస్తావించలేదు.

ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన జై లవకుశ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కానీ తారక్ పిక్ చూపించలేదు. దీంతో అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా చేస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అసలు ఇదంతా బాలయ్యకు తెలిసే జరుగుతోందా? లేదా షో నిర్వాహకులు కట్ చేస్తున్నారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయంపై నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ, జై లవకుశ ప్రస్తావన కానీ రాలేదని తెలిపారు. రానప్పుడు దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే బయట ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్న సమయంలో బాలయ్య.. తారక్ పేరును ప్రస్తావించినట్లు చెప్పారు.

"సినిమా పేరు గుర్తు రావట్లేదు.. ఓ మూవీలోని ఆ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని నా దగ్గర, బాబీ దగ్గర బాలయ్య అన్నారు.. అది లైవ్ లో కాదు.. ఆఫ్ లైన్ లో అలా అన్నారు".. అని నాగవంశీ తెలిపారు. తాను అటు తారక్ గారి చిత్రాలు చూస్తానని, ఇటు బాలకృష్ణ గారి సినిమాలు చూస్తానని, ఫ్యూచర్ లో మోక్షజ్ఞ వస్తే ఆయన మూవీలు కూడా చూస్తానని తెలిపారు. ఇప్పుడు నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News