దేవర బిజినెస్ రంగంలోకి స్టార్ ప్రొడ్యూసర్
ఇక ఫైనల్ గా ఆయన చేస్తున్న హడావుడి వెనుక కారణం తెలిసిపోయింది.
సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ దేవర ప్రస్తావన వస్తున్న ప్రతీసారి నాగ వంశీ చేస్తున్న హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఒక నిర్మాత తరహాలోనే ఆయన కూడా దేవరకు ప్రమోషన్ చేస్తున్నట్లు కనిపించారు. కానీ ఆయన నిర్మాత కాదు. ఇక ఫైనల్ గా ఆయన చేస్తున్న హడావుడి వెనుక కారణం తెలిసిపోయింది. అందుకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.
ముందుగా సినిమా వివరాల్లోకి వెళితే, రెండు భాగాలుగా రానున్న దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మిస్తోంది. కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సెప్టెంబర్ 27న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో తెలుగు, సౌత్, నార్త్ భాషల స్టార్ నటీనటులూ భాగమవుతున్నారని సమాచారం. ఇక 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు నాగ వంశీ దక్కించుకున్నారు. ఇటీవల, నాగ వంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తారక్ మరియు నాగ వంశీ కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఘన విజయం సాధించడంతో, 'దేవర' పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
నాగ వంశీ, 'దేవర' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంచనాల ప్రకారం, ఈ సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నాగ వంశీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయో స్పష్టత లేదు, కానీ గట్టి రేటే నిర్మాతలు కోట్ చేయగా, నాగ వంశీ ఆ హక్కులను దక్కించుకున్నారు. 'దేవర' సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొరటాల శివ 'ఆచార్య' ఫలితంతో నిరాశపరచినప్పటికీ, 'దేవర' కోసం చాలా కసిగా పని చేస్తున్నారు. ఈసారి ప్రేక్షకులకు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తపనగా ఉన్నారు.
'దేవర' సినిమా ద్వారా ఎన్టీఆర్ మరియు నాగ వంశీ మరోసారి ప్రేక్షకులను మెప్పించి, కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశముంది. 'దేవర' మూవీ టీజర్, పోస్టర్‌కి వచ్చిన స్పందన చూస్తే, సినిమా రిలీజ్‌పై ఉన్న అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రేక్షకులలో ఉన్న ఈ అంచనాలు, మూవీ రిలీజ్ తర్వాత ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి. ఇక సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ లిరికల్ సాంగ్ ను ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నారు.