గౌత‌మ్-సితార‌.. తోబుట్టువు గోల్స్

అలా ముసిముసిగా న‌వ్వుకుంటూ మొబైల్ లో చూస్తున్న ఈ అన్నాచెల్లెళ్లు.... త‌మ జీవితంలోని ప్ర‌తి అరుదైన అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Update: 2024-09-14 12:17 GMT

అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంతో గొప్ప‌ది. అది ఎమోష‌న‌ల్ బాండింగ్.. విడ‌దీయ‌రానిది. బంధాలు ప‌లుచ‌బ‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఇలాంటి అరుదైన ఫోటోగ్రాఫ్స్.. ప్ర‌జ‌ల‌కు స‌త్ సందేశాన్ని అందిస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్‌స్టార్ మహేష్ బాబు వార‌సులు గౌతమ్- సితార.. న‌డుమ తోబుట్టువుల బంధం ఈ ఫోటోగ్రాఫ్‌లో స్ప‌ష్ఠంగా ఎలివేట్ అయింది. అలా ముసిముసిగా న‌వ్వుకుంటూ మొబైల్ లో చూస్తున్న ఈ అన్నాచెల్లెళ్లు.... త‌మ జీవితంలోని ప్ర‌తి అరుదైన అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వారి క్యూట్‌నెస్‌ అభిమానులకు బిగ్ రిలీఫ్‌.

నమ్రతా శిరోద్కర్ స్వ‌యంగా ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు. తోబుట్టువులు అలా ఫోన్ చూడటం ..నవ్వుల్లో మునిగిపోవడం చూస్తుంటే వారి క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ అంద‌రి మోములో ఆనంద‌న్ని క‌లిగిస్తున్నాయి. ఇక పిల్ల‌ల‌కు మాన‌సిక ఆనందం ఆవ‌శ్య‌క‌త ఎలాంటిదో తెలిసిన‌దే. తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం, బలమైన కుటుంబ బంధాలను పెంపొందించడం హృద‌యాల‌ను ట‌చ్ చేస్తోంది. మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ తమ పిల్లలు ఎదగడానికి ... అభివృద్ధి కోసం ఒక సౌక‌ర్య‌వంత‌మైన ఆరాను క్రియేట్ చేసార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

గౌతమ్ తన సినిమా స్టడీస్ కోసం అతడిని న్యూయార్క్ కి పంపించిన సంగ‌తి తెలిసిందే. అత‌డిని క‌లిసేందుకు సితార స‌హా మ‌హేష్- న‌మ్ర‌త నిరంత‌రం లండ‌న్ ప్ర‌యాణాల్లో క‌నిపిస్తున్నారు. మ‌హేష్ ఎప్ప‌టిక‌ప్పుడు షార్ట్ ట్రిప్ లు ప్లాన్ చేస్తూ కుటుంబ స‌మేతంగా లండ‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాడు. గౌత‌మ్ - సితార భ‌విష్య‌త్ త‌రం స్టార్లుగా ఎదుగుతార‌ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ఆశిస్తున్నార‌. వారు వ‌డి వ‌డిగా ఎదిగేస్తున్న తీరు చూస్తూ మురిసిపోతున్నారు.

Tags:    

Similar News