కొడుకు గౌత‌మ్‌పైకి న‌మ్ర‌త ఫోక‌స్ షిఫ్ట్

గౌత‌మ్ ఎప్పుడూ ప్రయివేట్ పర్సన్‌గా లైమ్‌లైట్‌కి దూరంగా ఉండటానికే ఇష్టపడినా.. న‌ట‌శిక్ష‌ణ త‌ర్వాత అత‌డు ప‌రిపూర్ణుడిగా మార‌తాడు అన‌డంలో సందేహం లేదు.

Update: 2024-08-31 07:40 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ‌ ఘట్టమనేని త‌న తండ్రి- తాత గారి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని హీరోగా బ‌రిలోకి దిగుతాడ‌ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. నూనూగు మీసాల బాలా కుమారుడిగా ఎదిగేసిన గౌత‌మ్ ఇక‌పై ప్రేమ‌క‌థా చిత్రాల క‌థానాయ‌కుడిగా రాణించేందుకు అవ‌కాశం ఉంది. అయితే మ‌హేష్ లా పూర్తి స్థాయి ప‌రిణ‌తితో గౌత‌మ్ ని బ‌రిలో దించాల‌నేది న‌మ్ర‌త ప్లాన్. అత‌డు స్కూల్ కాలేజ్ స్ట‌డీస్ ని పూర్తి చేసుకుని, అదే స‌మ‌యంలో న‌ట‌శిక్ష‌ణ‌ను పూర్తి చేసి హీరో అవుతాడ‌ని ఇంత‌కుముందే న‌మ్ర‌త పూర్తి స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు. దీనికి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. కానీ గౌత‌మ్ రాక మాత్ర‌మ పక్కా!


ఫ‌లానా డేట్ కి గౌత‌మ్ హీరో అవుతాడ‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు కానీ, గౌత‌మ్ కృష్ణ ప‌క్కాగా హీరో అవుతాడ‌నే దానిపై ఆ కుటుంబం ఇప్ప‌టికే హింట్ ఇచ్చింది. డాక్ట‌ర్ వార‌సుడు డాక్ట‌ర్ అయిన‌ట్టే, సూప‌ర్ స్టార్ వార‌సుడు సూప‌ర్ స్టార్ అవ్వాల‌నే ఉద్ధేశం ఆ కుటుంబంలో చాలా స్ప‌ష్ఠంగా ఉంది.

గౌత‌మ్ ఎప్పుడూ ప్రయివేట్ పర్సన్‌గా లైమ్‌లైట్‌కి దూరంగా ఉండటానికే ఇష్టపడినా.. న‌ట‌శిక్ష‌ణ త‌ర్వాత అత‌డు ప‌రిపూర్ణుడిగా మార‌తాడు అన‌డంలో సందేహం లేదు. గౌతమ్ తన తండ్రి అడుగుజాడల్లో నడవడానికి, సినీ పరిశ్రమలో కెరీర్‌ను కొనసాగించడానికి చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో న‌మ్ర‌త‌ వెల్లడించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో స్టేజీ డ్రామాలో శిక్ష‌ణ పొందుత‌న్న గౌత‌మ్ రంగస్థలంపై తనదైన ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. గౌతమ్ మొదటి రంగస్థల ప్రదర్శన లండన్‌లో `రోమియో & జూలియట్`. ప్ర‌ద‌ర్శ‌న కోసం ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో చాలా నేర్చుకున్నాడు. తన కుటుంబం నుండి ఉత్సాహభరితమైన మద్దతును ఇప్ప‌టికే గౌత‌మ్ పొందాడు. అతడు తన తండ్రి 2014 చిత్రం `1: నేనొక్కడినే`లో కథానాయకుడి చిన్న వెర్షన్‌లో నటించాడు. కానీ న‌టుడిగా ప‌రిపూర్ణ‌త రంగ‌స్థ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తోనే సాధ్యం. అక్క‌డ అవ‌స‌రం మేర శిక్ష‌ణ కొన‌సాగుతోంది.

గౌతమ్ ఇంకా ఎదుగుతున్న పిల్లాడు. అత‌డి విష‌యంలో తొంద‌ర‌పాటు అవ‌స‌రం లేదు. అలాగే గౌత‌మ్ ఎంత సిగ్గ‌రి అయినా.. ప్రైవేట్ గా ఉండేందుకు ఇష్ట‌ప‌డే కుర్రాడు అయినా కానీ, ఎదిగే వ‌య‌సుతో పాటు ప‌రిపూర్ణ‌త సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతానికి న‌ట‌న డ్యాన్సుల ప‌రంగా శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. దీనికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉన్నాయి. న‌మ్ర‌త - మ‌హేష్ దంప‌తులు చాలా తెలివిగా అతడిని న‌ట‌శిక్ష‌ణ‌లో రాటు దేలేలా చాలా ఎర్లీగానే ప్లాన్ చేయ‌డం గ‌మ‌నించాలి. మ‌హేష్ న‌టుడిగా ఎదుగుద‌ల వెన‌క న‌మ్ర‌త ప్రోత్సాహం, స‌హ‌కారం మ‌రువ‌లేనివి. ఇక‌పై కొడుకు గౌత‌మ్ వైపు ఫోక‌స్ ని షిఫ్ట్ చేసార‌ని భావించాలి.

బ‌ర్త్ డే బోయ్ కి శుభాకాంక్ష‌లు:

నేడు గౌత‌మ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నమ్రతా శిరోద్కర్ త‌మ‌ కుటుంబ జీవితానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసారు. ఈ పోస్ట్‌లో మహేష్ బాబు తన ఇద్దరు పిల్లలైన గౌతమ్, సితారలతో కలిసి ఉన్న ఫోటో కూడా ఉంది. మ‌హేష్ కుటుంబం విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కిన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. గౌత‌మ్ తన జీవితంలో కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఎదిగేందుకు స‌హ‌క‌రించ‌డ‌మే న‌మ్ర‌త విధి. దానిని స‌వ్యంగా నిర్వ‌ర్తిస్తూ త‌న ప్రేమ‌ను అప‌రిమితంగా ఆవిష్క‌రిస్తున్నారు.

Tags:    

Similar News