'అఖండ‌-2' లో బాల‌య్య అఘోర 2.0!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థ‌నాయకుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌-2` ఇటీవ‌ల గ్రాండ్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-11-08 13:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థ‌నాయకుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌-2` ఇటీవ‌ల గ్రాండ్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఓపెనింగ్ రోజునే బాల‌య్య ప‌వ‌ర్ పుల్ డైలాగ్ తో అద‌ర‌గొట్టారు. ఒక క్ష‌ణం పై పాటు బాల‌య్య అలా డైలాగ్ చెప్ప‌డం చూసి స్పాట్ లో అంతా విస్తుపోయారు. ఆయ‌న సీన్ లోకి ఎప్పుడైనా? ఎలాగైనా? ప్ర‌వేశం చేసే న‌టుడ‌ని మ‌రోసారి జ‌నాల‌కు అర్ద‌మైంది. ఇలాంటి డైలాగులే కాదు..అంత‌కు మించి ప‌వ‌ర్పుల్ డైలాగులెన్నో? బాల‌య్య-బోయ‌పాటి కాంబోలో ఉంటాయి.

ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. `అఖండ`కు హిందీ ఓటీటీ లో వ‌చ్చిన రెస్పాన్స్ చూసి పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాల‌య్య పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందుతోంది. ఇందులో బాల‌య్య దేవాల‌యాల ప‌విత్ర‌త కాపాడే ప‌వ‌ర్ పుల్ పాత్ర పోషిస్తున్నార‌ని స‌మాచారం. హిందు దేవాల‌యా లు, గ్ర‌ధాల జోలికి ఎవ‌రొచ్చినా ? వాళ్ల తాట తీసేలా బాల‌య్య రోల్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ పాత్ర‌లో బాల‌య్య రౌద్రం మామూలుగా ఉండ‌ద‌ట‌. ఆయ‌న క‌ళ్ల‌లో కోపాన్ని చూస్తేనే శ‌త్రువు భ‌య‌పెడేలా ఉంటుందిట‌. ఇక్క‌డ స‌నాత‌న ధర్మాన్ని కూడా ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే బోయ‌పాటి ఓ పాన్ ఇండియా పాయింట్ నే ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు హిందుత్వం ఎలా ఉండేది? బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక హిందుత్వం ఎలా ఉంది? అనే పాయింట్ ని కూడా ట‌చ్ చేసి బాల‌య్య రోల్ ని డిజైన్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అయితే `అఖండ‌`లో బాల‌య్య అఘోర పాత్ర పోషించారు. పాత్ర ప‌రంగా అంత‌కు మించి పీక్స్ మ‌రొకటి ఉండ‌దు. `అఖండ‌-2` కాబ‌ట్టి అఘోర 2.0 కూడా ఉంటుంద‌నే అభిమానుల్లో అంచ‌నాలున్నాయి. నిజంగా ఆ రోల్ మ‌ళ్లీ బోయ‌పాటి తీసుకుంటే? ఈసారి పీక్స్ లోనే చూపిస్తారు. కాశీ లో రియ‌ల్ అఘోరాల‌నే స్ట‌డీ చేసి పాత్ర‌ని డిజైన్ చేసే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News