NBK 109.. అసలేం జరుగుతోంది?
డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ టైటిల్స్ లో మేకర్స్ ఒకటి కన్ఫర్మ్ చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఎలాంటి దూకుడు మీద ఉన్నారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు NBK 109 చిత్రంతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా వరల్డ్ వైడ్ గా తన కొత్త చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు.
అయితే పొంగల్ బరిలో బాలయ్య దిగుతారని అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సంక్రాంతి హిట్ సెంటిమెంట్ మరోసారి బాలయ్యకు కలిసి వస్తుందని ఫిక్స్ అయిపోయారు. నటసింహం ఖాతాలో మరో హిట్ కచ్చితంగా పడుతుందని చెబుతున్నారు. బాబీ.. ఇప్పటికే బాలయ్యను నెవ్వర్ బిఫోర్ మాస్ రోల్ లో చూపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అంతవరకు బాగానే ఉన్నా.. NBK 109 విషయంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ ఎందుకు లేట్ అవుతుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ టైటిల్స్ లో మేకర్స్ ఒకటి కన్ఫర్మ్ చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దసరా అన్నారు.. దీపావళి అన్నారు.. కానీ ఇంకా ప్రకటించలేదు.
రీసెంట్ గా NBK 109 నిర్మాత నాగవంశీ.. విజువల్స్ తో రెడీ చేసి టైటిల్ ను రివీల్ చేద్దామనుకున్నట్లు తెలిపారు. కానీ సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని, మరో పది రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ విడుదల చేయలేదు. దానిపై ఎలాంటి అప్డేట్ కూడా మేకర్స్ నుంచి లేదు. అయితే సినిమా రిలీజ్ కు రెండు నెలలే సమయం ఉన్నా.. ఇంకా కీలక సన్నివేశాల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది.
దీంతో డైరెక్టర్ బాబీ.. సంక్రాంతి టార్గెట్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి నెలల రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తే గానీ.. ఎలాంటి గజిబిజి లేకుండా సినిమా విడుదల చేయగలరు. అందుకు బాబీ శరవేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారట. ఆ తర్వాత ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారని సమాచారం. దీంతో మేకర్స్ బిజీగా ఉండడంతో.. టైటిల్ అప్డేట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి చూడాలి ఎప్పుడు ఇస్తారో..