ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- అబ్బాయిలు.. ఫ్యాన్స్ కు పండగే!

నరసారావు పేటలో సోమవారం ఉదయం సందడి చేశారు. ఆ సమయంలో నందమూరి ఫ్యాన్స్ ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.;

Update: 2025-03-31 10:23 GMT
ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- అబ్బాయిలు.. ఫ్యాన్స్ కు పండగే!

ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- ఇద్దరు అబ్బాయిలు.. ఆ బ్యానర్లు చూసి నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తున్నారు. దీంతో నెట్టింట ఎక్కడ చూసినా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్న పోస్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు విషయమేమిటంటే?


కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ఫుల్ డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.


అయితే సమ్మర్ కానుకగా సినిమాను మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ టీజర్ ద్వారా తెలిపారు. అదే సమయంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఆ నేపథ్యంలో కళ్యాణ్ రామ్.. నరసారావు పేటలో సోమవారం ఉదయం సందడి చేశారు. ఆ సమయంలో నందమూరి ఫ్యాన్స్ ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.


అంతకుముందు నరసారావు పేటలోని అనేక చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నందమూరి యువసేన పేరుతో ఉన్న అభిమానుల సంఘం.. కళ్యాణ్ రామ్ రాక నేపథ్యంలో పోస్టర్లు ఎక్కడెక్కడే పెట్టింది. వాటిలో కళ్యాణ్ రామ్ పిక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మాస్ ఫోటోస్ ను ప్రింట్ చేసింది.


దీంతో అవి వైరల్ గా మారాయి. ఫ్లెక్సీలు అదిరిపోయాయని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ కు కన్నుల పండగే అని చెబుతున్నారు. మాస్ లుక్ లో ఉన్న నందమూరి హీరోల పోజులు సూపర్ అని అంటున్నారు. అందులో ఒక స్పెషల్ పిక్ కూడా ఉంది.


బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఈవెంట్ లో తారక్, కళ్యాణ్ రామ్ కలిసి సందడి చేశారు. ఆ ఫోటో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో భాగంగా బ్యానర్స్ ఫ్రేమ్ లో బాబాయ్, అబ్బాయిలు కలిసి కనపడడంతో ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నందమూరి మాస్ అని కామెంట్లు పెడుతున్నారు.


ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ-2 మూవీ పనులతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, తారక్.. తన బాలీవుడ్ డెబ్యూ వార్-2తో పాటు నీల్ తో మూవీని కంప్లీట్ చేస్తున్నారు. ఆయన కూడా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. త్వరలో కళ్యాణ్ రామ్ తన అప్ కమింగ్ సినిమాతో సందడి చేయనున్నారు.


Tags:    

Similar News