దివాలీ ముందే వార‌సుడిని ప‌రిచ‌యం చేస్తున్నారా?

నంద‌మూరి అభిమానులంతా ఆ వార‌సుడు ఎలా ఉంటాడు? అనే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

Update: 2024-10-26 09:14 GMT

నంద‌మూరి ఫ్యామిలీతో ద‌ర్శ‌కుడు వై.విఎస్ చౌద‌రి బాండింగ్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. స్వ‌ర్గీయ నంద‌మూరి తారాక‌రామార‌వు స్పూర్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ముఖ్యంగా హ‌రికృష్ణ‌కి ఆయ‌న ఎలాంటి విజ‌యాలు ఇచ్చాడో తెలిసిందే. తాజాగా నంద‌మూరి నాలుగో త‌రం వార‌సుడు బాధ్య‌త‌లు కూడా చౌద‌రి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కీరామ్ కుమారుడిని వై.విఎస్ చౌద‌రి హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు.

అయితే ఇంత‌వ‌ర‌కూ అత‌డిని మీడియా ముందుకు తీసుకురాలేదు. అలేగే ఎలాంటి ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయ‌లేదు. దీంతో నంద‌మూరి అభిమానులంతా ఆ వార‌సుడు ఎలా ఉంటాడు? అనే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అందుకోసం చౌద‌రి ప్ర‌త్యేకంగా డేట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీపావ‌ళికి ముందే అక్టోబ‌ర్ 30న హీరో కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వ‌ద‌లాల‌ని చూస్తున్నారుట‌. ఈ లుక్ని చాలా ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించారుట‌.

నంద‌మూరి అభిమానుల్లో పున‌కాలు నింపేలా ఆ లుక్ ఉంటుంద‌ని గెస్సింగ్ తెర‌పైకి వ‌స్తున్నాయి. చౌద‌రి సినిమాలో హీరో అంటే ఎలా ఉంటాడు? అన్న‌ది గెస్ చేయ‌డం క‌ష్టం. ఆయ‌న కంటెంట్ ని లుక్ వ‌దులుతుంటాడు. మ‌రి ఈ వార‌సుడి కోసం సాప్ట్ కంటెంట్ ని తీసుకున్నాడా? లేక త‌న‌దైన మార్క్ ఫ్యామిలీ హీరోలా లాంచ్ చేస్తు న్నాడా? అన్న‌ది చూడాలి. ఫ‌స్ట్ లుక్ అనంత‌రం కొంత వ‌ర‌కూ క్లారిటీ వ‌స్తుంది.

వై.వి.ఎస్ చౌద‌రి చాలా కాలం త‌ర్వాత చేస్తోన్న సినిమా ఇది. ఆయ‌న చివ‌రి సినిమా రేయ్. అది డిజాస్ట‌ర్ అయింది. దీంతో ద‌శాబ్దం పాటు ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ చాలా గ్యాప్ తీసుకుని స్టోరీ సిద్దం చేసుకుని తెర‌పైకి వ‌చ్చాడు. ఈ గ్యాప్లో ఇండ‌స్ట్రీలో ఎన్నో మార్పులొచ్చాయి. ఇండ‌స్ట్రీ ట్రెండ్ మారింది. వాట‌న్నింటికీ త‌గ్గ‌ట్టే అత‌డు మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌నలో క‌సి ప‌ట్టుద‌ల చూస్తుంటే ఈసారి గ‌ట్టిగానే కొట్టేలా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా ప‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా లాంటి వారు ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వ్వ‌డం విశేషం.

Tags:    

Similar News