మోక్షజ్ఞ.. మళ్ళీ ఎక్కడికి?

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు.

Update: 2025-01-17 01:30 GMT

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ యువ హీరో మొదటి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. అయితే, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే అంశం ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి నెలలో మొదలవుతుందని టాక్ వచ్చినా, ఇంకాస్త ఆలస్యం అవుతుందనే సూచనలతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం బాలయ్య బాబు చాలామంది దర్శకులతో చర్చలు జరిపారు. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకులు కూడా కథలు చెప్పినా ఒప్పుకోలేదు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉంటుందని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రశాంత్ వర్మ ఇప్పటికే కథ సిద్ధం చేసి, సినిమా మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.

కానీ బాలయ్య ఇంకా కథ విషయంలో డైలమాలో ఉన్నాడని, ఆ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తాజాగా మోక్షజ్ఞ తన మొదటి సినిమా కోసం విదేశాలకు వెళ్లనున్నారని మరో కొత్త టాక్ వైరల్ గా మారింది. అక్కడ సినిమాకు సంబంధించి పలు చర్చలు జరుగుతాయని సమాచారం. ఈ చర్చల తర్వాతే సినిమాపై పూర్తిస్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బాలకృష్ణ కూడా మోక్షజ్ఞను తానే నిర్ణయం తీసుకునేలా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల మోక్షజ్ఞ తన మొదటి సినిమాపై మరింత ఆలోచన చేసి, పర్ఫెక్ట్ స్టార్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లడం వెనుక అదే అసలైన కారణమా లేదంటే మరొక నిర్ణయం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ సినిమా ఆలస్యం కావడం వల్ల ప్రశాంత్ వర్మ సైతం కన్ఫ్యూజన్ లేకుండా అతని ప్లాన్ లో అతనున్నాడు.

ప్రశాంత్ ఇప్పటికే హనుమాన్ 2, బ్రహ్మరాక్షస వంటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టుల స్క్రిప్ట్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఒకవేళ మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంటే, ప్రశాంత్ వర్మ తన మిగతా ప్రాజెక్టులతో ముందుకు సాగుతారు. మోక్షజ్ఞకు మొదటి సినిమా ఎంతో కీలకమైనదని అందరికీ తెలుసు. అందుకే, ఆయన ఈ ప్రాజెక్ట్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ ఎంపికలో బాలయ్య కూడా మోక్షజ్ఞ నిర్ణయాన్నే గౌరవించడం ద్వారా కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మోక్షజ్ఞ తన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతే తన మొదటి సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలిచిత్రం మంచి కథతో, ప్రాముఖ్యమైన దర్శకుడితో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి ఇంతకాలం అభిమానుల్లో ఏర్పడిన అంచనాలను నిజం చేస్తూ, మోక్షజ్ఞ తనదైన ముద్ర వేసే సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Tags:    

Similar News