BB4: క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యిందిగా..

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు రిపీట్ అవుతాయోనని అంతా ఎదురుచూస్తుంటారు

Update: 2024-06-10 05:49 GMT

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు రిపీట్ అవుతాయోనని అంతా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. చెప్పాలంటే మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందని.. అఖండ-2 అని కొన్ని రోజుల క్రితం బోయపాటి ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలలుగా అనేక వార్తలు వస్తున్నాయి. సినిమా స్టోరీ లైన్ ఇదేనని, షూటింగ్ మొదలు అప్పుడేనని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ- బోయపాటి మూవీని 14 రోల్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.

BB4 అంటూ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మన బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్టర్ పై రైటప్ ఇచ్చింది. మాసివ్ ఎపిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెప్పింది. "తెరపై ఫైర్ రేపేందుకు సూపర్ కాంబో మళ్లీ వచ్చేస్తోంది. రెండు పవర్స్ - గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను BB4 కోసం చేతులు కలిపారు. హ్యపీ బర్త్‌ డే బాలయ్య బాబు" అని పోస్టర్ ను షేర్ చేసింది.

అయితే పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ అంతా డివోషనల్ మోడ్ లో ఉంది. పెద్ద చక్రం కనిపిస్తోంది. రుద్రాక్షల మాల ఆసక్తి పెంచుతోంది. ఓవరాల్ గా పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. BB4 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. ఇప్పటికే వీరు బాలయ్యతో లెజెండ్ మూవీ చేశారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్.

ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బోయపాటి, బాలయ్య మూవీ అనౌన్స్మెంట్ వచ్చినా.. అది అఖండ-2 కాదో అవునో అనేది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం అఖండ సీక్వెలేనని తేల్చి చెప్పేస్తున్నారు. మరి బోయపాటి.. బాలయ్యతో అఖండ సీక్వెల్ తీస్తున్నారా లేదా వేరే స్టోరీతో సినిమా తెరకెక్కిస్తున్నారనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా బాలకృష్ణతో బోయపాటి తన మార్క్ యాక్షన్ మూవీ తీయడం పక్కా.

Tags:    

Similar News