మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇది మంచి వార్తే..

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ డెబ్యూ లలో ఒకటి, నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

Update: 2024-07-02 06:16 GMT

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ డెబ్యూ లలో ఒకటి, నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య అభిమానులు మరియు నందమూరి అభిమానులు ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సింహా సమయం నుంచే ఈ అంచనాలు మొదలయ్యాయి. కానీ మధ్యలో బాలకృష్ణ అనేక సార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఇప్పటి వరకూ మోక్షజ్ఞ ఎంట్రీ పై అధికారిక ప్రకటన రాలేదు కానీ, తాజా సమాచారం ప్రకారం, ఈ ఎంట్రీకి అన్ని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మోక్షజ్ఞ తన లేటెస్ట్ మేకోవర్ తో అభిమానులను అబ్బురపరచుతున్నారు. ఇన్ని రోజులు సాధారణ సింపుల్ లుక్ లోనే కనిపించిన మోక్షజ్ఞ, ఇప్పుడు ఒక సూపర్ స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. ఈ మార్పు చూసి అభిమానులు ఆనందంగా ఉన్నారు.

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి బాలకృష్ణ లాగే, మోక్షజ్ఞ కూడా తన అద్భుతమైన మేకోవర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకాలం సాధారణంగా కనిపించిన మోక్షజ్ఞ, ఇప్పుడు సరికొత్త లుక్ తో ముందుకు రావడం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు మాస్ ఆడియెన్స్ మరోవైపు క్లాస్ ఆడాయెన్స్ ను ఆకట్టుకునే విధంగా వారసుడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ పై ఇంకా స్పష్టత రాలేదు కానీ, అభిమానులు ఆయన ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ లాగా, మోక్షజ్ఞ కూడా తన ప్రతిభతో తండ్రి పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నారు. ఈ క్రేజీ ఎంట్రీ పై మరింత సమాచారం అందాలంటే, అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీకి మరో స్టార్ని తెచ్చి పెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more!

మొత్తానికి, నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, టాలీవుడ్ లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక గతంలో బాలయ్య చెప్పినదాని ప్రకారం మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.

అది కూడా తన డైరెక్షన్ లోనే ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. ఇక చాలామంది దర్శకులతో కూడా చర్చలు జరిపారు. మొదట బోయపాటి శ్రీను పేరు గట్టిగానే వచ్చింది. అనంతరం అనిల్ రావిపూడి అన్నారు. కానీ ఎవరు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. మరి మోక్షజ్ఞ ను మొదట ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News