ప్ర‌పంచ సుంద‌రి 2025 పోటీలో రాజ‌స్థానీ అందం

ఆ ముగ్గురూ సినీతార‌లుగా అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపుతో ఓ వెలుగు వెలిగారు.

Update: 2025-02-25 18:30 GMT

ప్ర‌పంచ సుంద‌రీమ‌ణులు ఐశ్వ‌ర్యారాయ్, ప్రియాంక చోప్రాల‌కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. విశ్వ సుంద‌రి సుస్మితా సేన్ కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ముగ్గురూ సినీతార‌లుగా అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపుతో ఓ వెలుగు వెలిగారు. ద‌శాబ్ధాలుగా అందాల పోటీల్లో భార‌తీయ వ‌నిత‌లు వెలుగులు విర‌జిమ్ముతూనే ఉన్నారు. వారిలో చాలా మంది సినీరంగంలో క‌థానాయిక‌లుగా ఎదిగారు. ఈసారి తెలంగాణలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున 'మిస్ ఇండియా వరల్డ్ 2023' నందిని గుప్తా ప్రాతినిధ్యం వహించనున్నారు.


నందిని రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల యువతి. అందాల పోటీలో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తన దృఢ సంకల్పం, అందం , తెలివితేటలతో 15 ఏప్రిల్ 2023న మణిపూర్‌- ఇంఫాల్‌లో జరిగిన పోటీలో టైటిల్‌ను గెలుచుకుంది. ఇటీవ‌లి స‌మాచారం మేర‌కు.. ఈసారి దేశంలోని అతి చిన్న రాష్ట్రం అయిన తెలంగాణ 72వ మిస్ వరల్డ్ పోటీల‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

మిస్ వరల్డ్ పోటీలు అత్యంత ప్రాచీన‌మైన‌వి. ఈ ప్రతిష్టాత్మక అందాల ఉత్సవం 1951లో బ్రిట‌న్‌లో ప్రారంభమైంది. దీనిని ఎరిక్ మోర్లీ నిర్వహించారు. 2000లో ఆయన మరణించిన తరువాత అతడి భార్య జూలియా మోర్లీ ఈ పోటీకి సహ అధ్యక్షత వహించారు. ఈసారి 72వ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం మరోసారి ప్రపంచ ఈవెంట్‌ను నిర్వహించడానికి ఎంపికైంది. ఈ ఎంపిక ప్రపంచ వేదికపై భారతదేశం ప్రభావం, సాంస్కృతిక ప్రభావాన్ని ఆవిష్క‌రించే ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవాలి.

ఈ అందాల పోటీలు మే 7 నుండి మే 31 వరకు జ‌ర‌గ‌నున్నాయి. పోటీలో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ- ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ న్యూఢిల్లీ - ముంబైలలో జూలియా మోర్లీ సిబిఇలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, పర్యాటక, సంస్కృతి, వారసత్వం & యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ ఈ వేడుక‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Tags:    

Similar News