నాని.. ఇంతకు తెగించాడంటే..
ఇప్పటివరకు చూసిన ఫ్యామిలీ హీరో పాత్రలను పక్కనబెట్టి, అతి కఠినమైన పాత్రలో కనిపించనున్నాడు.;
నేచురల్ స్టార్ నాని సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రతీసారి తన కథా ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ‘ది ప్యారడైజ్’ కోసం ఆయన చేసిన ప్రయోగం అతని గత చిత్రాలన్నింటికన్నా భిన్నంగా ఉంటుందని టీజర్‌తో స్పష్టమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ఊహించని విధంగా నానిని న్యూ షేడ్‌లో పరిచయం చేస్తోంది. ఇప్పటివరకు చూసిన ఫ్యామిలీ హీరో పాత్రలను పక్కనబెట్టి, అతి కఠినమైన పాత్రలో కనిపించనున్నాడు.
సినిమా టీజర్‌ను గమనిస్తే, మామూలుగా మనం నాని నుండి ఊహించని వైలెంట్ బాడీ లాంగ్వేజ్, Raw డైలాగ్స్ ఇందులో కనిపిస్తున్నాయి. ఆయన పాత్ర పూర్తిగా బహిరంగంగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా డిజైన్ చేయడం గమనార్హం. అసలు నాని నుండి ఇలాంటి మాస్ అవతారం రావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో భలే భలే మగాడివోయ్, హయ్ నాన్న లాంటి కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్‌లతో ఆకట్టుకున్న నాని, ఈసారి ఊహించని విధంగా రఫ్, రాగ్డ్ లుక్‌లో దర్శనమివ్వడం ఆశ్చర్యమే.
ఒక నటుడిగా తన కెరీర్‌లో ఓ ప్రత్యేక స్థాయికి చేరుకోవాలనే ఆలోచన ప్రతి హీరోలో ఉంటుంది. ఇప్పుడు అదే దిశగా నాని ప్రయాణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో కన్వెన్షనల్ హీరోగా ఉండటమే అతనికి పెద్ద ప్లస్ అయ్యింది. కానీ, ‘ది ప్యారడైజ్’తో పూర్తిగా తన స్టైల్‌ని మార్చుకుని, మునుపెన్నడూ చేయని ప్రయోగాన్ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో నాని శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా పూర్తిగా కొత్త దృక్పథంతో కనిపించనున్నాడని అర్ధమవుతుంది.
అయితే ఇంతలా డేరింగ్ డిసిషన్ తీసుకోవటానికి నానికి ఎదో బలమైన మోటివ్ ఉండే ఉంటుంది. ఈ రేంజ్ కథ క్యారెక్టర్ లో నటించాలి అంటే ముందున్న ఫేమ్ ను పట్టించుకోకుండా రిస్క్ చేయాల్సిందే. ఒక విధంగా తెగించి రంగంలోకి దిగడం లాంటిదే. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ అదో బిగ్ రిస్క్. అయితే నాని ఇంతకు తెగించాడు అంటే శ్రీకాంత్ చెప్పిన కంటెంట్ మాత్రం అతన్ని బలంగా మార్చి ఉంటుందని చెప్పవచ్చు.
నాని పాత్ర తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తే ఇది నాని ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే భిన్నమైనదని అర్థమవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ మధ్య సాఫ్ట్ హీరోగా ఓ స్థానం ఏర్పరచుకున్న నాని, ఈసారి పూర్తిగా తన కంఫర్ట్ జోన్‌ని వదిలేసి, మాస్ ఆడియన్స్‌కు కూడా తనను పరిచయం చేసుకునేలా ప్రయత్నిస్తున్నాడు. ఇది చిన్న ప్రయోగం కాదు, నిజంగా అతనికి గేమ్ ఛేంజర్‌గా మారేలా ఉంది.
‘ది ప్యారడైజ్’ అనేది కేవలం నానికి కొత్త మైలురాయి కాదు, టాలీవుడ్‌కు కూడా ఓ ప్రత్యేకమైన ప్రయోగంగా నిలిచే సినిమా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. నాని ఈ స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వెనుక ఉన్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. మరి సినిమా అతనికి ఏ రేంజ్ లో గుర్తింపు తీసుకు వస్తుందో చూడాలి.