నానిని చూసి స్టార్ కిడ్స్ నేర్చుకోవాలి!
ప్రముఖ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని అలియాస్ నవీన్ బాబు అనుకోకుండా హీరోగా అవతారం ఎత్తడం తెలిసిందే.;

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. అయితే కొంత మంది మాత్రం యాక్సిడెంటల్‌గా యాక్టర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అందులో నేచురల్ స్టార్ నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని అలియాస్ నవీన్ బాబు అనుకోకుండా హీరోగా అవతారం ఎత్తడం తెలిసిందే.
2008లో మోహన్‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన `అష్టాచెమ్మా` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నాని తనదైన మార్కు నటనతో పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ని సొంతం చేసుకుని నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే ఎనిమిదవ సినిమా తరువాత నాని కెరీర్ డేంజర్‌లో పడింది. `ఎటో వెళ్లిపోయింది మనసు` నుంచి `జెండాపై కపిరాజు వరకు నాని వరుస డిజాస్టర్‌లు ఎదుర్కోవడంతో ఇక తన పని అయిపోయిందనే కామెంట్‌లు వినిపించాయి. కెరీర్ ఇక ముగిసినట్టేనని అంతా కామెంట్‌లు చేశారు.
అయినా నాని బెదరలేదు. అప్పటి నుంచే కొత్తగా ఆలోచించడం, కొత్త కథలవైపు అడుగులు వేయడం మొదలు పెట్టాడు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే పట్టుదలతో కొత్త కథలని ఎంచుకోవడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతన్ని `ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్` వంటి సినిమాలు వరించి విజయాల్ని అందించాయి. ఆ తరువాత యావరేజ్‌లు ఎదురైనా `జెర్సీ`తో నాని కొత్త ప్రయాణం మొదలైంది. అప్పటి వరకు యావరేజ్ స్టార్‌గా ఉన్న నాని `జెర్సీ`తో టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయాడు.
అయితే శ్రీకాంత్ ఓదెల చేసిన `దసర` నానిని వంద కోట్ల క్లబ్‌లో చేర్చి మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా అందించిన ఉల్సాహంతో నాని తన పంథా మార్చుకుని భారీ మాస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. మాస్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో `హాయ్ నాన్న` వంటి క్లాస్ సినిమాల్లోనూ నటిస్తూ టైర్ 2 హీరోల్లో సెపరేట్ ట్రాక్‌ని క్రియేట్చేసుకోవడమే కాకుండా హీరోగా ఎలాంటి ప్లానింగ్‌తో ముందుకెళ్లాలో మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ హీరోల వారసులు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలో తెలియక సతమతమవుతుంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యాక్సిడెంటల్‌గా హీరోగా మారిన నాని చక్కని ప్లానింగ్‌తో మాస్, క్లాస్ సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. నాని ప్రస్తుతం మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని `హిట్ 3, `ది పారడైజ్` సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్లలో సందడికి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నాని ప్లానింగ్ ని గమనించిన ఇండస్ట్రీ వర్గాలు, ఆడియన్స్ స్టార్ కిడ్స్ నానిని చూసి చాలా నేర్చుకోవాలని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని హీరోగా ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యాడు మరి డైరెక్టర్‌గా ఎప్పుడు తన సత్తా చూపిస్తాడో అని కామెంట్‌లు చేస్తున్నారు.