నాని 'హిట్ 3'.. బిజినెస్ ఏ రేంజ్ లో జరిగిందంటే..

నేచురల్ స్టార్ నాని కథల ఎంపికలో ఎంత కొత్తగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-04-15 05:51 GMT
Nani HIT 3 Movie High Pre Release Business

నేచురల్ స్టార్ నాని కథల ఎంపికలో ఎంత కొత్తగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే సినిమాల ప్రమోషన్లో కూడా అంతే చాకచక్యంగా వ్యవహరిస్తాడు. 'దసరా', 'హాయ్ నాన్న' సినిమాలతో డిఫరెంట్ జానర్స్‌ని టచ్ చేసిన నాని.. ఇటీవల 'సరిపోదా శనివారం'తో కూడా మంచి హిట్ అందుకున్నాడు. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న నాని.. ఇప్పుడు ‘హిట్ 3’తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యాడు.

'హిట్' సిరీస్‌కి నాని నిర్మాతగానే కాదు.. స్క్రిప్ట్ బ్యాక్ గ్రౌండ్ లో సపోర్ట్ చేసినట్లు టాక్. 'హిట్ 1', 'హిట్ 2' సినిమాల విజయానంతరం ఇప్పుడు 'హిట్ 3'పై భారీ అంచనాలు ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని 'అర్జున్ సర్కార్' అనే బ్రూటల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏర్పడింది. నాని వాయిస్ ఓవర్, పవర్ ఫుల్ డైలాగ్స్, డార్క థ్రిల్లింగ్ నేపథ్యం ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

ఈసారి ‘హిట్ 3’ లో యాక్షన్ డోస్ గట్టిగానే ఉండనున్నట్లు అర్ధమవుతుంది. తన హిట్ ఫామ్‌కి తోడు ప్రమోషన్ ప్లానింగ్‌లో నాని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా ప్రచారానికి హై లెవెల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటలు, క్యారెక్టర్ పోస్టర్స్‌తో నాని జట్టు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది.

ఇక బిజినెస్ విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం 'హిట్ 3' ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇది నాని కెరీర్‌లో మూడో హయ్యెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ కావడం విశేషం. 'దసరా' తర్వాత నాని సినిమాకి ఇలా బజ్ క్రియేట్ కావడం, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు భారీగా అడ్వాన్స్ ఇచ్చేలా చేసిందంటే.. ఈ సినిమాపై ఉన్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ రైట్స్, శాటిలైట్, థియేట్రికల్ బిజినెస్ కలిపి హై రేంజ్‌లో గిట్టుబాటు అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. విజువల్స్, బీజీఎం, ఎడిటింగ్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేశారు. హై రేంజ్ షాట్ ప్లానింగ్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా టెక్నికల్‌గా చూసినా చాలా స్టాండర్డ్ ఉంది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం డే వన్ నుంచే మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశముంది. మొత్తానికి నాని వరుస హిట్స్‌తో మంచి జోష్‌లో ఉన్న తరుణంలో 'హిట్ 3' ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదే జోరులో ఉండటం విశేషం. మరి సినిమా రిలీజ్ తర్వాత ఈ బజ్‌ను బాక్సాఫీస్ నెంబర్స్‌లోకి మార్చుకుంటాడా నాని? అనే ప్రశ్నకు మే 1న క్లారిటీ రానుంది.

Tags:    

Similar News