'హిట్ 3' కి వాటికి ఏమాత్రం సంబంధం లేదట!
నేచురల్ స్టార్ నాని ఏ సినిమా చేసినా దాన్ని ప్రేక్షకుల చేరవేయడంలో చాలా ముందు వరుసలో నిలుస్తున్నారు.;

నేచురల్ స్టార్ నాని ఏ సినిమా చేసినా దాన్ని ప్రేక్షకుల చేరవేయడంలో చాలా ముందు వరుసలో నిలుస్తున్నారు. తనదైన స్టాటజీతో ప్రేక్షకుల్లో తన ప్రాజెక్ట్‌లపై నమ్మకాన్నికలిగిస్తూ వారితో శభాష్ అనిపించకుంటున్నారు. దీనికి ఇటీవల విడుదలై భారీ విజయాన్ని దక్కించుకున్న `కోర్ట్` మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా హిట్ కాకపోతే తాను నటించిన `హిట్3`ని చూడకండని స్టేట్‌మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన నాని తాజాగా `హిట్ 3` కోసం కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు.
`హిట్ 3` వర్కవుట్ కాకపోతే నన్ను నమ్మకండి అని స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిట్ సిరీస్‌లలో భాగంగా వస్తున్న మూడవ సిరీస్ ఇది. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా స్వయంగా నాని నటించి నిర్మించారు. `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. నాని రుత్‌లెస్ పోలీస్ అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటించిన ఈ మూవీ ట్రైలర్‌ని ఇటీవల విడుదల చేశారు.
సినిమాలో రక్తపాతం యానిమల్, కిల్, మార్కో చిత్రాలని గుర్తు చేస్తూ ఆడియన్స్‌కు ఒళ్లుగగుర్పొడిచేలా చేస్తోంది. `హిట్ 3` ట్రైలర్ చూశాక ఇది నాని కెరీర్‌లోనే ఆయన నటించిన మోస్ట్ వైలెంట్ పిల్మ్ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్‌లపై తాజాగా హీరో నాని తనదైన స్టైల్లో స్పందించారు. నాని మాట్లాడుతూ` హిట్ 3కి వాటికి ఎలాంటి సంబంధం ఉండదు. దేనికదే ప్రత్యేకమైనది. హిట్ 3 కి అవన్నీ దూరంగా ఉంటాయి.
యానిమల్, కిల్, మార్కొ సినిమాల గ్రామర్ వేరు. హిట్ 3 గ్రామర్ వేరు. ట్రైలర్ చూస్తే మీకు వైలెన్స్ అనిపించొచ్చు. కానీ సినిమా చూసేటప్పుడు ఇంత వైలెన్స్ ఏంటీ అనే ఆలోచన రాదు. కథలో లీనమవుతారు. ఇది క్రైమ్ థ్రిల్లర్. అందుకే దీన్ని పిల్లలకు చూపించొద్దని చెబుతున్నాను. అలా చెప్పడం నా బాధ్యత. నా కుమారుడిని కూడా ఈ సినిమాకు తీసుకెళ్లను. ఈ సినిమా కారణంగా ఓ వర్గం ప్రేక్షకులు తగ్గితే మరో వర్గం ప్రేక్షకులు పెరుగుతారు` అంటూ నాని ఆసక్తికర సమాధానం చెప్పడం గమనార్హం.