నాని హిట్ 3.. బిజినెస్ కూడా గట్టిగానే!
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.;

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో విభిన్న జానర్లను టచ్ చేసిన నాని.. ఇప్పుడు హిట్ 3 మూవీతో మరోసారి థ్రిల్లింగ్ యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఇందులో నాని 'అర్జున్ సర్కార్' అనే బ్రూటల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై హై బజ్ క్రియేట్ చేశాయి. నాని వాయిస్ ఓవర్, మాస్ డైలాగ్స్, డార్క టోన్ ట్రైలర్‌తో ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. నాని క్యారెక్టర్ మూడ్, మూవీ టేకింగ్ చూసి ఈసారి మరింత మాస్ యాంగిల్‌లో కథ నడుస్తుందనిపిస్తోంది. కథలో థ్రిల్‌తో పాటు యాక్షన్ దూకుడు కూడా ఎక్కువగానే ఉండబోతుందని టాక్.
ఇక బిజినెస్ పరంగా కూడా హిట్ 3 అంచనాలకు తగ్గట్లుగానే ప్రదర్శిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇది నాని కెరీర్‌లో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ తర్వాత మూడో హయ్యెస్ట్ బిజినెస్ కావడం విశేషం. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ కలిపి చాలా మంచి ధరకు అమ్ముడుపోయాయి.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. హై క్వాలిటీ విజువల్స్, టెక్నికల్ వర్క్, డిఫరెంట్ నేరేషన్ స్టైల్‌తో సినిమా ఇంటెన్సిటీ మెరుగ్గా ఉండబోతోంది. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్‌ని మరింత ఎలివేట్ చేయనున్నాయని యూనిట్ టాక్. మొత్తానికి నాని మాస్ మూడ్‌లో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హిట్ 3, ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి మార్క్ హిట్ కొట్టింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అదే ఫలితం రాబడితే.. నానికి ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. మే 1న థియేటర్లలో నాని ఊచకోత ఎలా ఉండబోతుందో చూడాలి.