హిట్-3 ట్రైలర్.. ఆ అమ్మాయి కోసం వైజాగ్ కు నాని!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.;

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరోగా.. మరో వైపు నిర్మాతగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. గత ఏడాది సరిపోదా శనివారం చిత్రంతో మంచి హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ సందడి చేస్తున్నారు.
ఇప్పుడు హిట్-3తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు నాని. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా మే1న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లోని ఓ థియేటర్ లో నిర్వహించారు మేకర్స్. ఆ సందర్భంగా నాని.. అక్కడ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూసి సంబరపడిపోయారు. అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అన్నారు నేచురల్ స్టార్. ఈవెనింగ్ వరకు ఇక్కడే ఉండాలని అనిపిస్తుందని, కానీ వేరే ఇంటర్వ్యూ ఉందని తెలిపారు.
"అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం.. నా పెళ్లికి ముందు.. ఇక్కడ ఒక అమ్మాయిని కలవడానికి వచ్చాను.. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నా.. అప్పటి నుంచి ఫ్యాన్స్ ను కలవడానికి వస్తున్నా.. అప్పుడు ఇప్పుడు ప్రేమ కోసమే వస్తున్నా.. మిగతా ప్రాంతాలకు వెళ్తే అన్న, తమ్ముడిలా చూస్తారు.. ఇక్కడ అల్లుడిలా చూస్తారు" అని అన్నారు.
"అందుకే నాకు వైజాగ్ వెరీ వెరీ స్పెషల్. హిట్-3 కొత్త జోనర్ మూవీ. ఎలాంటి కొత్త ప్రయోగం చేసినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఇప్పుడు మే1వ తేదీ అదే జరుగుతుందని ఆశిస్తున్నా" అని తెలిపారు. ఆ తర్వాత జనాల మధ్య ఉంటే అర్జున్.. మృగాల మధ్య ఉంటే అర్జున్.. వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్య ఉంటే అల్లుడు అంటూ డైలాగ్ చెప్పారు.
ఇలాంటి సెలబ్రేషన్స్ మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు నాని. ఆ తర్వాత తాను యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరుకునేవారు మే1న థియేటర్ కు రండని కోరారు. మిగతా వారు కూడా వచ్చేయండని అన్నారు. అబ్ కీ బార్.. అర్జున్ సర్కార్ అంటూ ఫ్యాన్స్ తో సెల్ఫీ వీడియో చేశారు. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.