నాని రెమ్యునరేషన్ మళ్ళీ పెరిగిందా?

'హిట్ 3'తర్వాత చేయబోయే సినిమాలకి నాని 35 కోట్ల రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-22 04:36 GMT

నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో జోరు మీద ఉన్నాడు. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటం విశేషం.

పాన్ ఇండియా రేంజ్ లో నాని కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ మూవీ గా ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీని తర్వాత శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో రెండో సినిమాని నాని చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓచిత్రం చేయనున్నట్లు టాప్ నడుస్తోంది. ఇలా వరుస సినిమాలతో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే వరుస విజయాలతో నాని మార్కెట్ రేంజ్ కూడా జరిగింది. ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఆయనపై బిజినెస్ నడుస్తోంది. దీంతోపాటు డిజిటల్ మార్కెట్ కూడా నాని సినిమాలకు గణనీయంగా పెరిగింది మంచి ప్రీమియం ధరలకు నాని సినిమాలను ఓటీటీ ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నానితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ ముందుకొస్తున్నారు. పెరిగిన మార్కెట్ నేపథ్యంలో నాని తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. 'హిట్ 3' తర్వాత చేయబోయే సినిమాలకి నాని 35 కోట్ల రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం టైర్ టు హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ గా నాని ఉన్నాడు.

నిర్మాతలు కూడా నాని డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలను వినిపిస్తోంది. హిట్ 3 మూవీ ఫ్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటే నాని టైర్ వన్ హీరోల జాబితాలోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి వెనుకాడకపోవచ్చని అనుకుంటున్నారు. అప్పుడు నాని రెమ్యునరేషన్ మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News