నాని ఒరిజినల్ మాస్ చూపిస్తాడా..?
ఐతే నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా అనిపించే ఒక మంచి అబ్బాయిగా అనుకున్నాం.;
న్యాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ ఫస్ట్ గ్లింప్స్ చూసిన ఆడియన్స్ అంతా కూడా ఒకింత షాక్ కి గురవుతున్నారు. ఏంటి అష్టా చమ్మాతో కెరీర్ మొదలు పెట్టిన ఆ నానినేనా ఇలా మాస్ విధ్వంసానికి సిద్ధమయ్యాడు అనిపిస్తుంది. కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు నాని. ఐతే నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా అనిపించే ఒక మంచి అబ్బాయిగా అనుకున్నాం. కెరీర్ మధ్యలో జెండాపై కపిరాజు, పైసా అంటూ కొన్ని ప్రయోగాలు చేసినా అవి రివర్స్ లో కొట్టాయి.
అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిగా నాని ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఇక వరుస క్రేజీ సినిమాలతో అదరగొడుతూ వచ్చిన నాని దసరా సినిమాతో ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. దసరా ముందు వరకు నాని వేరు దసరా తర్వాత నాని వేరు అనిపించాడు. శ్రీకాంత్ ఓదెల ఏ ముహుర్తాన దసరా కథను నానికి చెప్పాడో కానీ థరణి పాత్రలో నాని దుమ్ముదులిపేశాడు.
ముఖ్యంగా తను మాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించిన నాని ఇక మీదట అదే మేనియా కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రెండో సినిమాగా ప్యారడైజ్ వస్తుంది. ఈ సినిమాలో నాని మరోసారి తన మాస్ ర్యాంపేజ్ చూపించబోతున్నాడు. ముఖ్యంగా రిలీజైన ప్యారడైజ్ గ్లింప్స్ చూసిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.
నాని లోని ఒరిజినల్ మాస్ ని బయటకు తీస్తే ఇలా ఉంటుందా అనుకుంటున్నారు. దసరాతో కొద్దిపాటి మాస్ హీరోగా మారిన నాని ప్యారడైజ్ తో పూర్తి స్థాయిలో మాస్ విధ్వంసం చూపించబోతున్నాడు. నాని నుంచి ఈ రేంజ్ మాస్ బొమ్మని ఎవరు ఊహించలేదు. గ్లింప్స్ తోనే ప్యారడైజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పేలా చేశారు.
నాని ప్యారడైజ్ లో కథ గురించి చూచాయగా ఇదొక కాకి జాతి కథ అంటూ చాలా మంచి పాయింట్ నే టచ్ చేశాడు. నాని కచ్చితంగా ఈ సినిమాతో ఇదివరకు ఎప్పుడు చూడని.. అసలు ఎవరు ఊహలకు అందని విధంగా మాస్ పాత్రలో కనిపించనున్నారు. మరి గ్లింప్స్ తోనే అరుపులు పెట్టించిన ఈ ప్యారడైజ్ బాక్సాఫీస్ పై ఎలాంటి హంగామా చేస్తుందో నెక్స్ట్ మార్చిలో తెలుస్తుంది.