పిల్లలు చూడలేని సినిమాలో నాని

నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే విధంగా ఉంటాయనే అభిప్రాయం ఉంది.

Update: 2024-09-03 04:13 GMT

నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే విధంగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. అలాగే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కుటుంబంతో కలిసి వెళ్లి సినిమా చూడొచ్చు. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలు యాక్షన్ అంశాలు ఎక్కువగానే ఉన్నా కూడా ఫ్యామిలీ అందరూ చూడగలిగే చిత్రంగానే ఉంది. పిల్లలు కూడా నాని సినిమాలని ఇష్టపడుతూ ఉంటారు.

చాలా మంది పిల్లలు నానికి ఫ్యాన్స్ గా ఉంటారు. వారికి నచ్చే అంశాలు నాని చేసే సినిమాలలో చాలా ఉంటాయి. నాని కెరియర్ లో వైలెన్స్ ఎక్కువ ఉండి, అస్సలు పిల్లలు చూడలేని విధంగా ఉన్న సినిమాలు అంటే పెద్దగా లేవని చెప్పొచ్చు. ఒక్క దసరా మాత్రమే రెండు చోట్ల యాక్షన్ సీక్వెన్స్ కాస్తా వైలెంట్ గా ఉంటాయి. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమా సక్సెస్ మీట్ లో నాని నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నేను చేయబోయే నెక్స్ట్ సినిమాని పిల్లలకి అస్సలు చూపించకండి. ఎందుకంటే అందులో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. తలలు నరికే సన్నివేశాలు ఉంటాయి. అందుకే ముందే సూచిస్తున్నట్లు తెలిపారు. సరిపోదా శనివారం సినిమాలో కాస్తా హింసాత్మక సన్నివేశాలు ఉన్న కూడా అందరూ చూడగలిగే విధంగానే ఉంటాయి. అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలో సీక్వెన్స్ మాత్రం పిల్లలు చూడలేరని చెప్పిన నాని ముందే రెడ్ అలెర్ట్ ఇచ్చారు.

ఇలా చెప్పడం ద్వారా నెక్స్ట్ నాని నుంచి రాబోయే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో A సర్టిఫికెట్ ఉండే మోస్ట్ వైలెంట్ స్టోరీస్ కి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. యానిమల్, సలార్ లాంటి సినిమాలు సక్సెస్ లు చూసిన తర్వాత చాలా మంది వైలెంట్ కథలని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని లైన్ అప్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ తెరకెక్కనుంది. దీంతో పాటుగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో మొదలవుతుందని నాని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హిట్ 3 మూవీ గురించి నాని చెబుతున్నాడనే మాట వినిపిస్తోంది. హిట్ 3లో నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అతని పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని హిట్ 2లోనే చూపించారు. ఇక శ్రీకాంత్ సినిమా కూడా దాదాపు అదే రేంజ్ లో ఉండనున్నట్లు టాక్.

Tags:    

Similar News