నాని రెమ్యునరేషన్.. కోవిడ్ తరువాత ఎంత పెరిగిందంటే..
టాలీవుడ్ లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఇమేజ్ పెంచుకుంటున్న నటుడు నాచురల్ స్టార్ నాని.
టాలీవుడ్ లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఇమేజ్ పెంచుకుంటున్న నటుడు నాచురల్ స్టార్ నాని. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్త కథలని నాని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మాస్, క్లాస్ టచ్ ఏదైనా కూడా తనదైన శైలిలో పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ అందరికి చేరువ అయ్యాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నాని ఇమేజ్ పెరుగుతోంది. దానికి తగ్గట్లుగానే నాని రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ ఉండటం విశేషం.
2008లో అష్టాచెమ్మా సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన నాని కంటిన్యూస్ గా మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు. కెరియర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేక కొంత ఇబ్బంది పడ్డారు. అయితే 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి నాని కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. వరుస సక్సెస్ లు అందుకుంటూ టైర్ 2 హీరోల జాబితాలోకి వచ్చేసాడు. 2017లో చేసిన నేను లోకల్ సినిమాకి ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ నాని అందుకున్నాడు.
ఆ తరువాత నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలకి కూడా అంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. 2019లో చేసిన జెర్సీ సినిమాకి 18 కోట్లు అందుకున్నాడు. నెక్స్ట్ కరోనా సమయంలో దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన V మూవీకి 15 కోట్లు మాత్రమే తీసుకున్నారు. టక్ జగదీష్ కి 15 కోట్లు ఛార్జ్ చేశాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి మూవీలకి మరల 18 కోట్ల వరకు రెమ్యునరేషన్ నాని అందుకున్నారు.
ఆ రెండు యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా దసరా సినిమాకి బడ్జెట్, అలాగే హెవీ కాల్ షీట్స్ కారంగా ఏకంగా 22 కోట్ల వరకు నాని రెమ్యునరేషన్ తీసుకున్నారు. హాయ్ నాన్న సినిమాకి కూడా 23 కోట్లు అందుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాకి కెరియర్ లో అత్యధికంగా 25 కోట్ల రెమ్యునరేషన్ ని నాని తీసుకున్నారని తెలుస్తోంది.
కరోనా కాలంలో 15 కోట్లలో ఉన్న నాని రెమ్యునరేషన్ ఈ నాలుగేళ్లలో 10 కోట్లు పెరిగి ఏకంగా 25 కోట్లకి చేరుకుంది. అలాగే అతని మార్కెట్ వేల్యూ కూడా 40 కోట్ల నుంచి 60 కోట్లకి చేరింది. ఈ లెక్కల ప్రకారమే నాని అత్యధిక రెమ్యునరేషన్ ని అందుకుంటున్న టైర్ 2 హీరోగా ఉన్నాడు. సరిపోదా శనివారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఏమైనా రెమ్యునరేషన్ పెంచుతాడా లేదంటే 25 కోట్ల దగ్గరే ఉంటాడా అనేది చూడాలి.