నాని ప్యారడైజ్ రా స్టేట్మెంట్ తోనే రచ్చ చేయబోతున్నాడా..?

ఆ సినిమా రిలీజ్ అవుతుండగానే తన నెక్స్ట్ సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తున్నాడు నాని.

Update: 2025-03-01 12:28 GMT

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే ఆడియన్స్ లో ఒక రకమైన ఆసక్తి ఏర్పడేలా చేసుకున్నాడు. వరుస హిట్ సినిమాలతో తన రేంజ్ పెంచుకుంటూ అందుకు తగినట్టుగానే కథలను ఎంపిక చేసుకుంటున్నాడు నాని. లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారంతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని మే 1న హిట్ థర్డ్ కేస్ తో రాబోతున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవుతుండగానే తన నెక్స్ట్ సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తున్నాడు నాని.

నాని తో దసరా లాంటి సినిమా తీసి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే నాని మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ లాక్ చేశారు. శ్రీకాంత్ ఓదెల నాని కాంబో ఎలా ఉంటుందో దసరా సినిమాతో చూపించగా ఈ ప్యారడైజ్ దానికి మించి ఉండేలా చూస్తున్నారట. ముఖ్యంగా ప్యారడైజ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కోసం వదిలిన లుక్కే అదిరిపోయింది.

కాకి పోస్టర్ తో నాని ప్యారడైజ్ రా స్టేట్మెంట్ లోడింగ్ అంటూ వదిలిన పోస్టర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ పోస్టర్ చూస్తేనే మళ్లీ దసరా కాంబో మరో సూపర్ కమిట్మెంట్ తో వస్తున్నారని అనిపిస్తుంది. నాని సినిమాకు కావాల్సినంత బజ్ ఈ పోస్టర్ తోనే క్రియేట్ అయ్యింది. ఇంతకీ అసలు ప్యారడైస్ కథ ఏంటి ఈ సినిమా తో ఎలాంటి అటెంప్ట్ చేస్తున్నారు అన్న దానికి శాంపిల్ గా మరో రెండు రోజుల్లో చిన్న గ్లింప్స్ రాబోతుంది.

ప్యారడైజ్ రా స్టేట్మెంట్ తోనే నాని శ్రీకాంత్ ఓదెల నిప్పు రాజేసేలా ఉన్నారని తెలుస్తుంది. సినిమా ప్రకటనతోనే రచ్చ రచ్చ చేసేలా ఉన్నారు. నాని ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. కథకి తగినట్టుగానే నాని పర్ఫెక్ట్ కాస్ట్ అండ్ క్రూని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

దసరా కలయికలో మరో సినిమా అంటే దసరా రేంజ్ కాదు ఈసారి అంతకుమించి అనిపించేలా చేయాలని నాని, శ్రీకాంత్ ప్యారడైజ్ చేస్తున్నారు. మరి పోస్టర్ తోనే బజ్ పెంచిన న్యాచురల్ స్టార్ ప్యారడైజ్ ఫస్ట్ గ్లింప్స్ తో ఎలాంటి హంగామా చేస్తాడన్నది చూడాలి. దసరా డైరెక్టర్ హీరోనే కాదు ప్యారడైజ్ ని దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరినే నిర్మిస్తున్నారు. సో హిట్టు కాంబో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టుకి గురి పెట్టి మరీ వస్తున్నారని చెప్పొచ్చు.

Tags:    

Similar News