నాని సినిమా.. OG నిర్మాత క్లారిటీ ఇస్తారా?

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో 'Nani 32' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-29 18:41 GMT

నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల 'సరిపోదా శనివారం' మూవీతో అలరించిన నాని.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3: ది థర్డ్ కేస్' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో 'Nani 33' సినిమా చేయనున్నారు. ఇదే క్రమంలో సుజిత్ డైరెక్షన్ లో 'Nani 34' మూవీ రానుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో 'Nani 32' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఒక వైలెంట్ మ్యాన్ కొన్ని పరిస్థితుల కారణంగా నాన్ వైలెంట్ గా మారిన తర్వాత, అతని ప్రపంచం ఎలా తలక్రిందులు అయిందనే స్టోరీ లైన్ తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. నాని బర్త్ డే స్పెషల్ గా ఒక వీడియోని కూడా వదిలారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ మూవీ ముందుకు వెళ్ళలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే పుకార్లు పుట్టుకొచ్చాయి.

'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ టైంలో సుజీత్ సినిమా గురించి నాని క్లారిటీ ఇచ్చారు. వెనక్కి వెళ్ళింది కానీ, క్యాన్సిల్ అవ్వలేదని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల చిత్రం పూర్తయిన వెంటనే ఉంటుందని చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించడం లేదనే రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం సుజీత్ తో OG మూవీ చేస్తున్న అగ్ర నిర్మాత.. నాని సినిమాని నిర్మించడం లేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ 'శ్యామ్ సింగ రాయ్' ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి చేతికి వెళ్లిందని అంటున్నారు.

నిజానికి 'శ్యామ్ సింగరాయ్' సినిమా కూడా నిర్మాతకు ఈ విధంగానే వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ వర్కౌట్ అవ్వదేమో అని నిర్మాతలు ఆలోచన చేయడంతో, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ లో వెంకట్ బోయనపల్లితో చేసారు నాని. ఇప్పుడు సుజీత్ సినిమా బడ్జెట్ విషయంలో దానయ్య ఆలోచనలో పడటంతో, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 'సరిపోదా శనివారం' సినిమాకి కూడా ఇలాంటి రూమర్సే వచ్చాయి. కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ మూవీ రూపొందింది. ఇప్పుడు నాని-సుజిత్ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తారని అంటున్నారు. మరి దీనిపై దానయ్య క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

నాని - సుజీత్ కాంబోలో మాఫియా బ్యాక్ డ్రాప్ స్టైలిష్ యాక్షన్ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళకపోవడం గురించి నాని మాట్లాడుతూ.. ''సుజీత్ సినిమా వెనక్కి వెళ్ళింది.. కరెక్ట్ గా దాని ప్లేస్ కు వెళ్ళింది. రషప్ చేసి ముందుకు తీసుకొద్దాం అనుకున్నాం. నిజానికి దాని ప్లానింగ్ కి ఆ సెటప్ కి, ప్రీ ప్రొడక్షన్ కి ఎంత టైం కావాలనేది చూస్తే.. కరెక్ట్ ప్లేస్ మెంట్ కి వెళ్ళిందనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల సినిమా తర్వాత కచ్చితంగా సుజిత్ మూవీ ఉంటుంది. ఇనిషియల్ ప్లానింగ్ కూడా అదే. కాకపోతే ముందుకు తీసుకొద్దాం అనుకున్నాం. కానీ కంగారుగా చేయడం ఎందుకు అని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాం'' అని చెప్పారు.

Tags:    

Similar News