నాని ‘ది ప్యారడైజ్’ RAW టీజర్: ఇది ఒక లం** కొడుకు కథ!

నేచురల్ స్టార్ నాని ప్రతి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక న్యూ డిఫరెంట్ పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది.;

Update: 2025-03-03 06:26 GMT

నేచురల్ స్టార్ నాని ప్రతి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక న్యూ డిఫరెంట్ పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు అర్ధమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇపుడు RAW అంటూ ఒక టీజర్ రిలీజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

నాని విభిన్నమైన మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్‌గా విడుదల కాగా, అది పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేసిన పాత్రల్లో ఇది అతను చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పొచ్చు. RAW ట్రుథ్ RAW లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం డిఫరెంట్ గా ఉంది.

చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ ఒక ప్రాంతంలో శవాలు, ఆకాశంలో కాకులను చూపిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది. టీజర్‌ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా రూపొందించబడిందో అర్థమవుతుంది. కథలో చేదు సత్యాలు, కష్టాల ద్వారా బలంగా ఎదిగే జీవన సత్యాలు ప్రతిబింబించేలా ఉంటుందని అర్ధమవుతుంది.

అమ్మ రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన జాతి కథ.. అనే డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. కథలో కంటెంట్ చాలా వైల్డ్ ఎమోషన్స్ తో ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఒక ధగడ్ వచ్చి.. జాతిల మొత్తం జోష్ తెచ్చిండు.. ఆట్.. అంటూ నాని ఇంట్రో గూస్ బంప్స్ ఇస్తోంది. కాకులను ఒకటి చేసిన ఒక లం** కొడుకు కథ.. అని చెప్పిన విధానం చూస్తుంటే సినిమాలో బలంగా ఏదో చెప్పబోతున్నాడు అని అనిపిస్తోంది.

ముఖ్యంగా కాకుల కథనాన్ని సినిమా ప్రధాన కథగా మలచడం కొత్తగా అనిపిస్తుంది. టీజర్‌లో నాని పూర్తి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అతని రూపం ఒక కొత్త ఆవిష్కరణలా అనిపిస్తోంది. ఇందులో నాని గెటప్ పూర్తిగా యూనిక్‌గా ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా అతని లుక్ డిజైన్ చేశారు. ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, రఫ్ లుక్, కళ్ళలో కఠినత.. ఇవన్నీ సినిమాలో కొత్త లెవెల్ ఎమోషన్‌ను జోడించినట్లు అనిపిస్తుంది.

ఇక వీటన్నింటికి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్ అనేలా ఉంది., టీజర్‌లో నాని పూర్తి ముఖాన్ని చూపించకపోవడం సినిమాపై మరింత మిస్టరీని పెంచేలా చేసింది. కథ, కథనం, విజువల్స్ అన్నీ పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తన గత సినిమా ‘దసరా’ తర్వాత మరింత పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో ‘ది ప్యారడైజ్’ని రూపొందిస్తున్నాడు.

మాస్ ఎలిమెంట్స్, రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నాని పాత్రను పెంచే ప్రయత్నం చేశాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈసారి కూడా రస్టిక్, రియలిస్టిక్ టచ్‌ను వదలకుండా, మరింత మల్టీ-లెవెల్ ఎమోషన్స్‌ను జోడిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. వేసవి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Full View
Tags:    

Similar News