బోల్డ్ అండ్ వైల్డ్ గా నేచుర‌ల్ స్టార్ !

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-27 05:47 GMT

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `ద‌స‌రా` బ్లాక్ స్టార్ త‌ర్వాత ఇద్ద‌రు మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. `ద‌స‌రా`లో నాని ఊర మాస్ క్యారెక్ట‌ర్ ఎలా పండిందో చెప్పాల్సిన ప‌నిలేదు. నాని మాస్ లుక్. ..సీన్స్ ఎలివేష‌న్ తో ఆ సినిమా 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది.

అలా శ్రీకాంత్ తొలి సినిమాతోనే సెంచ‌రీ కొట్ట‌గా..అప్ప‌టి వ‌ర‌కూ సెంచ‌రీకి దూరంగా ఉన్న నాని కూడా అదే సినిమాతో 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా పాన్ ఇండియా లో వ‌ర్కౌట్ అవ్వ లేదు గానీ రీజ‌న‌ల్ గా స‌క్సెస్ అవ్వ‌డంతో? ఆ రేంజ్ లో వ‌సూళ్ల‌ను తేగ‌లింది. ఈ నేప‌థ్యంలో `ప్యార‌డైజ్` మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌క చిత్ర‌మ‌వుతుంద‌ని అంచనాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి.

దీంతో సినిమాలో నాని పాత్ర ఎలా ఉండ‌బోతుంది? అన్న దానిపై అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. ప్రాజెక్ట్ మొద‌లైన నాటి నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. ఇందులో నాని బోల్డ్ అండై వైల్డ్ గా ఉండ‌బో తుంద‌ని స‌మాచారం. `ద‌స‌రా` ని మించి మాస్ పాత్ర‌లో నాటుగా క‌నిపిస్తాడ‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క‌థ పూర్తిగా సికింద్రా బాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందిట‌. నాని లుక్.. డైలాగులు మ‌రింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయ‌ని స‌మాచారం.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు నానిపై లుక్ టెస్ట్ కూడా నిర్వ‌హించారుట‌. శ్రీకాంత్ అనుకున్న గెట‌ప్ కి నాని స‌రిపోతాడా? లేదా? అన్న సందేహంలో లుక్ టెస్ట్ చేసి ఫిట్ అవ్వ‌డంతోనే తీసుకున్నాడుట‌. సాధార ణంగా సీనియ‌ర్ హీరోల విష‌యంలో లుక్ టెస్ట్ లు ఉండ‌వు. కానీ అప్పుడ‌ప్పుడు ప‌ర్పెక్ష‌న్ కోసం చేస్తుంటారు. ఫిట్ అవ్వ‌ని సంద‌ర్భంలో ఆ ప్రాజెక్ట్ ల‌ను హీరోలే వ‌దులుకుంటారు. కానీ నాని అన్ని ర‌కాలుగా ఈ పాత్ర‌కు సెట్ అవ్వ‌డంతో? డైరెక్ట‌ర్ అండ్ కో ధైర్యంగా మూవ్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News