నాని న్యాచురల్ స్టార్ ట్యాగ్ మారుతుందా..?
ఈ సినిమా తర్వాత నాని కి పక్కాగా మాస్ ఇమేజ్ వస్తుందని తప్పకుండా న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు.
న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఆల్రెడీ వివేక్ తో నాని అంటే సుందరానికీ సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యిందా లేదా అన్నది పక్కన పెడితే కొంతమంది ఆడియన్స్ కు మాత్రం అది బాగా నచ్చేసింది.
ఇక వివేక్ తో నాని రెండో ప్రయత్నంగా సరిపోదా శనివారం సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా మాత్రం మాస్ అండ్ కమర్షియల్ అటెంప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందట. ఈ క్లైమాక్స్ చూశాక నాని న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా మారిపోద్ది అనిపించేలా కిక్ ఇస్తుందట. ఈ సినిమా తర్వాత నాని కి పక్కాగా మాస్ ఇమేజ్ వస్తుందని తప్పకుండా న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు.
నాని వివేక్ తీస్తున్న ఈ సినిమా లో కావాల్సినంత కమర్షియల్ హంగులు పొందుపరిచారట. సినిమా క్లైమాక్స్ ఒక్కటే ఒక రేంజ్ లో ఉండబోతుందని చెబుతున్నారు. దసరాతో నానికి మాస్ ఇమేజ్ వచ్చినా దాన్ని స్ట్రాంగ్ చేసేందుకు సరిపోదా శనివారం వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి శనివారం బాషా అంటూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు క్లైమాక్స్ గురించి వచ్చిన ఈ లీక్స్ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుంది. మరి ఈ రేంజ్ అంచనాలు పెంచేస్తున్న నాని సరిపోదా శనివారం అంచనాలకు తగినట్టుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు. సినిమా నాని ఖాతాలో మరో సూపర్ హిట్ పక్కా అని అంటున్నారు. మరి నిజంగానే నాని ఫ్యాన్స్ కు సరిపోయేంత మాస్ ట్రీట్ ఇస్తాడా లేదా అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ రవితేజ వస్తుండగా ఈ రెండు సూపర్ హిట్ అయినా కూడా ఆగుష్టు 29 కల్లా దూకుడు తగ్గిస్తాయి. సో నానికి మంచి స్కోప్ దొరుకుతుందని చెప్పొచ్చు.