నారా రోహిత్ ఎంగేజ్మెంట్.. పల్నాడు నటితోనే.

మరికొద్ది రోజుల్లో నారా వారి అబ్బాయి.. ఓ ఇంటి వాడు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-10-10 08:33 GMT

యంగ్ హీరో నారా రోహిత్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేసే నటుడిగా పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఒకటైన నారా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. తనకంటూ స్పెషల్ క్రేజ్ దక్కించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి రెండో కుమారుడు అయిన రోహిత్.. త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నారని కొన్ని గంటలుగా వార్తలు వస్తున్నాయి.

మరికొద్ది రోజుల్లో నారా వారి అబ్బాయి.. ఓ ఇంటి వాడు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. అది నిజమేనని తెలుస్తోంది. రీసెంట్ గా తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ను నారా రోహిత్ ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు. ఏపీలోని పల్నాడు ప్రాంతానికి చెందిన ఆ చక్కటి తెలుగమ్మాయితో ఏడడుగులు నడవనున్నారు. నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దగ్గరుండి వివాహ సంబంధం కుదిర్చారు.

తన పెద్దనాన్న, పెద్దమ్మ చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఆధ్వర్యంలో నారా రోహిత్ నిశ్చితార్థం.. అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్ లో సింపుల్ గా జరగబోతోంది. అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే వేడుకకు హాజరు కానున్నారు. భువనేశ్వరి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఇక డిసెంబర్ లో నారా రోహిత్ వివాహం ఘనంగా జరగనుందని ఇండస్ట్రీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ విషయం వైరల్ గా మారడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు విషెస్ చెబుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై త్వరలో నారా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఇక నారా రోహిత్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

నారా రోహిత్ కెరీర్ విషయానికి వస్తే.. డెబ్యూ మూవీ బాణంతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సోలో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. రౌడీ ఫెలో, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీర భోగ వసంత రాయలు సినిమాలతో ఆడియన్స్ కు చేరువయ్యారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత రీసెంట్ గా ప్రతినిధి 2తో పలకరించారు. ఇప్పుడు తన జీవితంలోని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు.

Tags:    

Similar News