రేస్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్ బావమరిది..
'సలార్' సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిందని కాస్త క్లారిటీ రాగానే, ఇండస్ట్రీలో ఆ డేట్ కోసం పోటీ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే
'సలార్' సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిందని కాస్త క్లారిటీ రాగానే, ఇండస్ట్రీలో ఆ డేట్ కోసం పోటీ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆ డేట్ పై కర్చీఫ్స్ వేయగా, మరికొన్ని చిత్రాలు ఆ విడుదల తేదీని ఖరారు చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఆ విడుదల తేదీ ఖరారు చేసుకున్న సినిమాల్లో జానియర్ ఎన్టీఆర్ బావమరిది నటించిన మ్యాడ్ కూడా ఒకటి. అయితే ఇప్పుడీ సినిమా ఆ రేస్ నుంచి కూడా తప్పుకుంటుందని తెలిసింది.
వివరాళ్లోకి వెళితే.. ఎన్టీఆర్ బావమరి నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక హీరోయిన్లుగా నటించారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి.
ఈ ప్రాజెక్ట్ తోనే నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక కూడా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబరు 28న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28 రేసు నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లు తెలిసింది. మరో డేట్ కు షిఫ్ట్ అయినట్లు సమాచారం అందింది. అయితే సరైన కారణమేంటో తెలియలేదు.
తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. పోస్టర్ ను వదిలారు. కానీ ఈ పోస్టర్ లో సెప్టెంబర్ 28 రిలీజ్ డేట్ మిస్ అయింది. దీంతో ఈ చిత్రం వాయిదా పక్కా అని అంటున్నారు. అక్టోబర్ 6న రిలీజ్ చేసే అవకాశముందని తెలిసింది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. షామ్ దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫీ అందించగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
ఇంజినీరింగ్ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు రీసెంట్ గా రిలీజై బాగా ఆకట్టుకున్నాయి. ఎలాగో ఇప్పటి వరకు కాలేజీ నేపథ్యంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ నే అందుకున్నాయి. కాబట్టి ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ చిన్న పాత్రలో నటించారు.