రామ్ చరణ్ అతన్ని పక్కనబెట్టినట్లేనా?
దాదాపు ఆ కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం కూడా దరిదాపుల్లో లేనట్లే కనిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రాల షెడ్యూల్ ఫిక్సైన సంగతి తెలిసిందే. `గేమ్ ఛేంజర్` షూటింగ్ పూర్తికాగానే జూన్ నుంచి ఆర్సీ 16 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇది బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం. ఇది పూర్తవ్వగానే వెంటనే సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని సైతం ప్రకటించారు. వచ్చే ఏడాది ఆర్సీ 16 రిలీజ్ అవుతుంది. అటుపై సుకుమార్ సినిమా రిలీజ్ తేదీపై క్లారిటీ వస్తుంది. మరి కన్నడ దర్శకుడు నార్తన్ ప్రాజెక్ట్ ఏమైనట్లు? అంటే దానిపై మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదనే తెలుస్తోంది.
దాదాపు ఆ కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం కూడా దరిదాపుల్లో లేనట్లే కనిపిస్తోంది. వాస్తవానికి `గేమ్ ఛేంజర్` తర్వాత చరణ్ ..నార్తన్ తోనే సినిమా చేస్తాడని ఏ రేంజ్ లో ప్రచారం సాగిందో తెలిసిందే. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని..ఓ యూనిక్ కథాంశంతో యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ అని గట్టిగానే ప్రచారం సాగింది. ఆ సమయంలో సుకుమార్ పేరుగానీ..బుచ్చిబాబు పేరుగానీ తెరపైకి రాలేదు.
దీంతో ఆ కాంబినేషన్ లో సినిమా దాదాపు కన్పమ్ అయినట్లే నని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నార్తన్ పక్కకు పోయి బుచ్చి...సుక్కులు తెరపైకి రావడం షాకింగ్ అనే చెప్పాలి. మరి నార్తన్ తో మళ్లీ చరణ్ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. దర్శకుల ఎంపిక విషయంలో ఎప్పుడెలా సమీకరణాలు మారుతుంటాయో గెస్ చేయడం కష్టం.
అప్పట్లో కొరటాల శివతో చరణ్ సినిమా ఠెంకాయ కొట్టి మరీ ఆపేసాడు ఓసినిమా. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో? కారణం ఏంటి? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు. చరణ్ గానీ..కొరటాల గానీ ఎక్కడా ఓపెన్ అయింది లేదు. తాజాగా నార్తన్ విషయంలో కూడా అలాంటి చెప్పకూడని సంఘటన ఏదైనా చోటు చేసుకుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.