'నరుడి బ్రతుకు నటన' ట్రైలర్.. ఎలా ఉందంటే?
మజిలీ, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో కనిపించి మెప్పించిన నటుడు శివకుమార్ రామచంద్రపు.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే
మజిలీ, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో కనిపించి మెప్పించిన నటుడు శివకుమార్ రామచంద్రపు.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరోగా నరుడి బ్రతుకు నటన మూవీ రూపొందుతోంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే నరుడి బ్రతుకు నటన నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ చూస్తున్నంతసేపు కేరళను అలా చుట్టి వచ్చినట్టు అనిపించిందని, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా ఫీల్ అయినట్టు అనిపించిందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నటి, నిర్మాత మెగా డాటర్ నిహారిక చేతుల మీదుగా ఆవిష్కరించారు. సవాళ్లు, బాధలు, ఎదురుదెబ్బలతో నిండిన ప్రతి ఒక్కరి జీవిత కథ అంటూ పోస్ట్ చేశారు.
ఒంటరిగా ఉన్న నీ చెల్లిపై రే*ప్ చేశాడు.. నీ రియాక్షన్ ఏంటి అన్న సీన్ కు యాక్షన్ చేయమంటే హీరో.. కరెక్ట్ గా చేయడు. దీంతో అంతా హేళన చేస్తారు. ఆ తర్వాత హీరోను జాబ్ చూసుకోమంటాడు తండ్రి. అలా కేరళ వెళ్లగా ఫ్రెండ్ పరిచయమవుతాడు. అతడి చెల్లిని ప్రేమించగా.. ఆమె బ్రదర్ అని పిలుస్తుంది. ఆ తర్వాత ట్రైలర్.. ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లిపోయింది. మొత్తంగా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజువల్స్ ఫుల్ నేచరుల్ గా ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్ కు మించి ఆకట్టుకుంటున్నాయి. అచ్చం కేరళలో ఉన్నట్లే అనిపిస్తుంది. శివకుమార్ రామచంద్రపు సహా పలువురి యాక్టింగ్ చాలా బాగుంది. NYX లోపేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి ట్రైలర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అంచనాలు పెంచుతోంది.
అయితే రిలీజ్‌కు ముందే నరుడు బ్రతికే నటన సినిమాను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ చేశారు. ఇప్పటి వరకు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను మూవీ గెలుచుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాలో నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో రూపొందిన ఆ సినిమాను అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.