ముంబై వీధుల్లో ప్రియుడితో న‌టాషా స్వైర‌విహారం!

ఇరువురు రెస్టారెంట్ ల్లో..బ‌ప్ ల్లో చిక్కిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక ఇటీవ‌ల హార్దిక్ -న‌టాషా విడిపోయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-12 09:35 GMT

హార్దిక్ పాండ్యా మాజీ భార్య న‌టాషా స్టాంకోవిచ్ కూడా సెకెండ్ ల‌వ్ స్టోరీని స్పీడ‌ప్ చేసిదా? ఇంత‌కాలం చాటుమాటుగా న‌డిపించిన క‌థ‌ని ఇప్పుడు అధికారికం చేస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. హార్దిక్ పాండ్యా-న‌టాషా విడిపోతున్నారు అన్న పుకార్లు మొద‌లవ్వ‌గానే న‌టాషా ఫ్రెండ్ ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో ల‌వ్ లో ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

ఇరువురు రెస్టారెంట్ ల్లో..బ‌ప్ ల్లో చిక్కిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక ఇటీవ‌ల హార్దిక్ -న‌టాషా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం స్వ‌దేశం సెర్బియాకి వెళ్లిపోయింది. రెండు నెల‌లు పాటు అక్క‌డే ఉంది. తాజాగా ఇటీవ‌లే మ‌ళ్లీ ఇండియాకి తిరిగొచ్చింది. కుమారుడు అగ‌స్త్య‌ను మాజీ భ‌ర్త ఇంటికి పంపించింది. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో న‌టాషా రెండ‌వ ల‌వ్ స్టోరీని స్పీడ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

తాజాగా ప్రియుడితో అమ్మ‌డు ముంబై వీధుల్లో షికార్లు కొడుతోంది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. ఇద్ద‌రు ఒకే కారులో ప్ర‌యాణం చేస్తూ చిక్కారు. పాండ్య‌తో అధికారికంగా విడాకులు ప్ర‌క‌టించిన త‌ర్వాత మీడియా కంటికి ప్రియుడితో చిక్క‌డం ఇదే తొలిసారి. అందులోనూ ముంభైలో. దీంతో ఈ వార్త ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇరువురు విదేశీయులే.

కానీ ఇప్పుడిలా ప‌నిగ‌ట్టుకుని ముంబైలో తిర‌గ‌డం దేనికి? హార్దిక్ ని ఊరించ‌డానికా? అంటూ కామెంట్లు ప‌డుతున్నాయి. హార్దిక్ పాండ్య కూడా మ‌రో కొత్త భామ‌తో డేటింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News