అడ్వెంచ‌ర్ టూరిజం.. న‌వ‌దీప్‌తో సాహ‌సానికి సిద్ధ‌మా?

రొటీన్ కి భిన్నంగా అడ్వెంచ‌ర్ టూరిజ‌మ్ ని ప్లాన్ చేసాడు టాలీవుడ్ యంగ్ హీరో న‌వ‌దీప్.;

Update: 2025-03-29 15:22 GMT
అడ్వెంచ‌ర్ టూరిజం.. న‌వ‌దీప్‌తో సాహ‌సానికి సిద్ధ‌మా?

ఇది రియ‌ల్ వెంచ‌ర్ కాదు.. బిట్ కాయిన్ వ్యాపారం అస‌లే కాదు.. స్కూళ్లు, కాలేజీలు, ఆస్ప‌త్రుల వ్యాపారం కానే కాదు.. క‌నీసం టూరిజం కూడా కాదు. ఇది క‌చ్ఛితంగా ఇన్నోవేటివ్ బిజినెస్. రొటీన్ కి భిన్నంగా అడ్వెంచ‌ర్ టూరిజ‌మ్ ని ప్లాన్ చేసాడు టాలీవుడ్ యంగ్ హీరో న‌వ‌దీప్.

అత‌డు ప్ర‌పంచ సాహ‌సికుడిగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించాడు. అత‌డితో పాటు అడ్వెంచ‌ర్ ట్రిప్స్ లో భాగం కావాల‌నుకునే ఔత్సాహిక సాహికుల‌కు అత‌డు గొప్ప అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. బేర్ గిల్స్ తో మ‌రో అడ్వెంచ‌ర్ టూర్‌లా న‌వ‌దీప్ తో అడ్వెంచ‌ర్ ట్రిప్‌కి మీరు సిద్ధం కండి. ఇది ఎన్.ఎస్ 4 ట్రిప్.

ఈ ఇనిషియేష‌న్ పేరు ''నవ్, లెట్స్ గో డీప్''. ఇది టూరిస్టుల‌ను ఊరిస్తోంది. అత‌డు అడ్వెంచ‌ర్ టూర్ లో భాగంగా కొన్ని ప్ర‌దేశాల‌ను ఎంపిక చేస్తాడు. అక్క‌డ సాహ‌సికులు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగే అవ‌కాశం క‌ల్పిస్తాడు.

ఎవ‌రెస్ట్ ఎక్క‌క‌పోయినా, దానికి ముందే ఉన్న ల‌ఢ‌ఖ్ కి ఎలా చేరుకోవాలో న‌వ‌దీప్ వెంటే డేర్ చేస్తే తెలుస్తుంది. హిమాల‌యాల‌ను అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించ‌వ‌చ్చు. అక్క‌డ ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాధించ‌వ‌చ్చు. క్యూరేటెడ్, విలాసవంతమైన సాహసయాత్రలకు తీసుకెళుతూ అత‌డు మ‌జాను అందిస్తాడు. లడఖ్ కఠినమైన ప్రకృతి దృశ్యాల నుండి ఐలాండ్ లోని ఘాఢ‌మైన అందాల వ‌ర‌కూ.. ఆఫ్రికా అభ‌యారణ్యంలో క్రూర జంతువుల వ‌ర‌కూ ప్ర‌తి ప్ర‌యాణంలో సాహ‌సాల‌ను ఆస్వాధించాలంటే న‌వ్ డీప్ టూర్‌లో అడుగుపెట్టాల్సిందే.

జీవితంలో ఒకే ఒక్క‌సారి.. ఒక‌వేళ ఇదే మొద‌టిసారి లేదా ఇదే చివ‌రి అడ్వెంచర్ కూడా కావ‌చ్చు. ప్ర‌తి ప్ర‌యాణం గ‌మ్మ‌త్త‌యిన అనుభ‌వాన్ని మిగులుస్తుంది. నవదీప్ స్వయంగా మీ సహ-ప్రయాణికుడిగా కొన‌సాగుతాడు. ఇది రొటీన్ వ్యాపారానికి భిన్న‌మైన‌ది. ఈ టూర్ కోసం ఒక ల‌గ్జ‌రియ‌స్ ప్యాకేజీ ఉంటుంది. బ‌హుశా ఇలాంటి సాహ‌సాల క‌థ‌ల‌తో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో అడ్వెంచ‌ర్ ట్రిప్ లో థ్రిల్స్ ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించారు. ఇప్పుడు న‌వ‌దీప్ కి రెండు అవ‌కాశాలు. ఒక‌టి అడ్వెంచ‌ర్ ట్రిప్ ని విజ‌య‌వంతం చేయ‌డం, అందులో థ్రిల్స్ ని క‌థ‌లుగా మ‌లిచి సినిమాలు తీయ‌డం. ఈ రెండిటినీ అత‌డు స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌డు.

నవదీప్ కి వ్యాపారం కొత్త కాదు. అత‌డు ప‌బ్ ల నిర్వాహ‌కుడిగా అంద‌రికీ తెలుసు. సినీనిర్మాత‌గా 2024లో `ఏవం` చిత్రాన్ని నిర్మించాడు. అతడిలోని సాహ‌సి కొత్త ఆలోచ‌న‌ల‌కు తెర తీసాడు. అత‌డి సృజనాత్మక మనస్తత్వం నటనకు మించిన‌ది. ముఖ్యంగా అత‌డు కొన్ని రియాలిటీ షోలను నిర్వ‌హించాడు. వాటిలో అడ్వెంచ‌ర్ల‌ను ఎంజాయ్ చేసాడు. అత‌డు ప్రయాణం పై తనకున్న ప్రేమను పూర్తి స్థాయి, ఉన్నత స్థాయి వ్యాపారంగా మారుస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. అత‌డిని చూసి పరిశ్రమలోని వ్యక్తులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రత్యేకమైన విధానంతో NS4 ట్రిప్స్ భారతదేశంలో ప్రముఖులను సెల‌బ్రిటీల‌ను విశేషంగా అల‌రిస్తాయ‌ని భావిస్తున్నారు. న‌వ‌దీప్ కొత్త వెంచర్ గేమ్-ఛేంజర్‌గా మారుతుందా? సాహస ప్రియులను, విలాసవంతమైన ప్రయాణికులను ఒకేలా ఆకర్షిస్తుందా? నవదీప్ ఆలోచ‌న ఎంత‌వ‌ర‌కూ నెగ్గుతుందో వేచి చూడాలి. ఇది స‌క్సెసైతే క‌చ్ఛితంగా ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తుంది.

Tags:    

Similar News