అతనితో పర్ఫెక్ట్ సింక్.. నిజమైన ప్రేమను వెతికే కథ..!
జై సినిమాతో హీరోగా పరిచయమై లీడ్ రోల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన నవదీప్ కొన్నాళ్లు సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు.
జై సినిమాతో హీరోగా పరిచయమై లీడ్ రోల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన నవదీప్ కొన్నాళ్లు సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. సూపర్ టాలెంటెడ్ యాక్టర్ అయిన నవదీప్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లవ్, మౌళి. నవదీప్ సెకండ్ వెర్షన్ గా వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది. ఈ సినిమాను రాజమౌళి దగ్గర రైటింగ్ టీం లో పనిచేసిన ఆయన శిష్యుడు అవనీంద్ర డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాను నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుండి ‘A’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మరిన్ని చిత్ర విశేషాను హీరో నవదీప్ మీడియాతో పంచుకున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు వున్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్‌ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను. నా తపన కూడా నా స్నేహితులకు కూడా అర్థం చేసుకుని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాషన్‌తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.
సరదాగా హీరో రానాకు కథ చెప్పాను. కథ బాగుందని చెప్పి ఈ సినిమాలో రానా అఘోరాగా ఒక ముఖ్యపాత్రను చేశాడు. అంతేకాదు నా కోసం ఎదైనా చెయ్యాలని చెప్పి రానా ఈ పాత్రను చేశాడు. నిజంగా చెప్పాలంటే రానాకు ఈ పాత్ర చేయడం అవసరం లేదు. నాతో వున్న స్నేహంతో పాటు పాత్ర చేశాడు. ఈ రోజు వరకు కూడా రానా ఈ చిత్రం చేశాడని రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. ఈ సినిమాలో ఈ పాత్రను రానా చేయకపోతే మా దర్శకుడు చేసేవాడు.
ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ఏ విషయంలో కూడా రొటిన్‌గా వుండదు. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి వుంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.
ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్‌లో వుండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.
ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్‌మౌళి ఎక్స్‌పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని చూసి పంకూరిని సెలక్ట్ చేశాం. చిత్రం క్యారెక్టర్‌కు ఆ అమ్మాయి బాగా కుదిరింది. దర్శకుడు తను అనుకున్న పాత్ర కోసం సరైన ఆర్టిస్ట్ దొరికే వరకు ఎక్కడా రాజీపడలేదు. కొత్త అమ్మాయిని కాకుండా సీనియర్ హీరోయిన్ పెట్టే పాత్ర కాదు. ఈ రోజు సినిమాకు పంకూరి ఎంతో ప్లస్ అయ్యింది.
పర్సనల్‌గా నన్నునన్నుగా వుండనిచ్చే అమ్మాయి నాకు కావాలనిపిస్తుంది.
నేను పూర్తిగా దర్శకుడికి నమ్మాను. సినిమా మొత్తం ఆయన విజనే వదిలేశాను. కేవలం నా గెటప్ పాత్ర గురించి మాత్రమే నేను కేర్ తీసుకున్నాను. ఇది ప్రేమలో వున్న మనిషికి నిజమైన ప్రేమ గురించి వెతికే పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్రలో డిఫరెంట్ ఎమోషన్స్ వుంటాయి.
సినిమా చూసిన కపుల్స్‌కు ఎక్కడో ఒక్క దగ్గర సినిమాకు రిలేట్ అవుతారు. కొత్తగా పెళ్లైన వాళ్లకు, బాయ్‌ఫ్రెండ్స్ కు ఎక్కడో ఒక్క దగ్గర తగులుతుంటాయి.
నా రియల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు వున్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనభవాలు ఈ సినిమాలో వున్నాయి. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా వుంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా వుండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా వుంచితే.. బాగుంటుంది.
న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు తమిళంలో నిత్యమీనన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా వున్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి వుంటుంది. దర్శకుడు అవనీంద్ర, నా కాంబినేషన్‌లో కూడా మరో సినిమా చేద్దామని అంటున్నారు. నాకు మాత్రం ఒక పూర్తి వినోదాత్మక సినిమా చేయాలని వుంది.