శంక‌ర్ జీ తిట్టేసి సారీ చెబుతారు!

మ‌రి శంక‌ర్ ఈరెండింటిలో ఈ టైపు అంటే? ఆయ‌న మొద‌టి ర‌కం ద‌ర్శ‌కని తెలుస్తోంది.

Update: 2024-10-24 14:13 GMT

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆన్ సెట్స్ లో ఎలా ఉంటారు? అన్న‌ది చాలా మందికి తెలియ‌దు. చాలా మంది డైరెక్ట‌ర్లు సెట్స్ లో కోప‌గించుకుంటారని వింటుంటాం. చెప్పిన ప‌ని చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే అప్పుడున్న ప‌రిస్థితుల్లో డైరెక్ట‌ర్లు అలా రియాక్ట్ అవ్వ‌డం స‌హ‌జం. అయితే అలా రియాక్ట్ కాని డైరెక్ట‌ర్లు కూడా చాలా మంది ఉంటారు. నెమ్మ‌దిగా చెప్పి చేయించుకునే వాళ్లు ఉన్నారు. మ‌రి శంక‌ర్ ఈరెండింటిలో ఈ టైపు అంటే? ఆయ‌న మొద‌టి ర‌కం ద‌ర్శ‌కని తెలుస్తోంది.

ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ఎన్నో సినిమాలు తెర‌కెక్కించారు. ఎంతో మంది స్టార్ హీరోల‌తో, న‌టీన‌టులతో, హీరోయిన్లతో ప‌నిచేసారు. అయితే ఇంత‌వ‌ర‌కూ చేసిన‌వ‌న్నీ త‌మిళ సినిమాలే. అక్క‌డ న‌టీన‌టుల‌తోనే ప‌నిచేసారు. కాబ‌ట్టి ఆయ‌న ఆన్ సెట్స్ లో ఎలా ఉంటారు? అన్న‌ది అక్క‌డ వ‌ర‌కే పరిమిత‌మైంది. తొలిసారి ఆయ‌న రామ్ చర‌ణ్ తో `గేమ్ ఛేంజ‌ర్` అనే తెలుగు సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా కావ‌డంతో ఇందులో న‌టీన‌టులు ఎక్కువ‌గా తెలుగు వారే ఉన్నారు. ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్టుల‌తో శంక‌ర్ ప‌నిచేయడం కూడా ఇదే తొలిసారి.

న‌వీన్ చంద్ర‌, శ్రీకాంత్ న‌టులు గేమ్ ఛేంజ‌ర్ లో న‌టిస్తున్నారు. వాళ్ల పాత్ర‌ల సంగ‌తి ప‌క్క‌న బెడితే శంక‌ర్ చెప్పింది స‌రిగ్గా చేయ‌క‌పోతే ఎలా రియాక్ట్ అవుతారు? అన్న‌ది న‌వీన్ చంద్ర బ‌య‌ట పెట్టాడు. ఓ గ్రూప్ సీన్ చేసే స‌మ‌యంలో దూరంగా ఉన్న జూనియ‌ర్ ఆర్టిస్ట్ స‌రిగ్గా చేయ‌క‌పోతే పైర్ అయిన‌ట్లు తెలిపారు. ఆ విష‌యం ఆయ‌న మాట‌ల్లోనే, ` క్లైమాక్స్ ఓ సిచ్వేష‌న్ లో చాలా మంది జూనియ‌ర్ ఆర్టిస్టులున్నారు. కానీ ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ మాత్రం త‌ప్పు చేసాడు. దీంతో శంక‌ర్ గారు తిట్టారు.తిట్టిన త‌ర్వాత మ‌ళ్లీ షాట్ కి వెళ్లాం.

ఆ షాట్ అయిపోయింది. ఆ స‌మ‌యంలో శంక‌ర్ గారు మానిటర్ లో సీన్ చూస్తున్నారు. షాట్ అనంత‌రం శంక‌ర్ గారు కూర్చున్న చోట నుంచి లేవి వెళ్లి ఆ జూనియ‌ర్ ఆర్టిస్ట్ కి అంత‌మంది స‌మ‌క్షంలో సారీ చెప్పారు. ఇది శంక‌ర్ లో ఓ గొప్ప క్వాలిటీ. ఏం త‌మ్మ‌డు నీకు డైలాగ్ ఇచ్చాం. బాగా చెబుతావు అనుకున్నాం. ఎందుకు చెప్ప‌లేదు. ఇంత మంది ఉన్నాం క‌దా. సారీ ఏమ‌నుకోవ‌ద్దు నేను నిన్ను తిట్టాన‌ని. ఆ ఒక్క ఇన్సిడెంట్ కాదు. అలాంటివి చాలా జ‌రిగాయి. అంత‌టి గ్రేట్ హ్యూమ‌న్. షూటింగ్ మోడ్ లో ఆయ‌నో రాక్ష‌సుడు` అన్నారు.

Tags:    

Similar News