నవీన్ అనగనగా ఒక రాజు.. డైరెక్టర్ ట్విస్ట్ ఏంటో..?

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-25 09:39 GMT

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ కాగా అప్పటి నుంచి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. నవీన్ కి యాక్సిడెంట్ వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు నవీన్ హెల్త్ అంతా సెట్ అయ్యింది. త్వరలోనే సినిమా షూటింగ్ కు వెళ్లనుంది. అందుకే నవీన్ సినిమా అప్డేట్ తో వచ్చారు మేకర్స్.

అనగనగా ఒక రాజు నుంచి రాజు గారి పెళ్లి సందడి అంటూ ఒక గ్లింప్స్ వదిలారు. ఆ వీడియోలో రాజు గారి పెళ్లి భోజనాలు మొత్తం బంగారుమయంతో నిండి ఉంది. బంగారు ప్లేట్లు, గ్లాసులు ఇలా పెళ్లంటే రాజు గారిదే అనిపించేలా చూపించారు. రాజు గారి ప్రీ వెడ్డింగ్ టీజర్ డిసెంబర్ 26న వస్తుందని అనౌన్స్ చేశారు. ఐతే ఈ టీజర్ కాన్సెప్ట్ అంతా బాగుంది కానీ సినిమా డైరెక్టర్ పేరు మాత్రం దాచేశారు.

అసలైతే ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. అతను మ్యాడ్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ కూడా చేస్తున్నాడు. మరి డైరెక్టర్ ఆ సినిమాతో బిజీగా ఉన్నాడని అనగనగా ఒక రాజుకి డైరెక్టర్ మార్చారో ఏమో కానీ డైరెక్టర్ పేరు లేకుండానే ఈ టీజర్ వదిలారు. అంతేకాదు నవీన్ పొలిశెట్టిని స్టార్ ఎంటర్టైనర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.

మరి నవీన్ సినిమాకు ఈ డైరెక్టర్ ట్విస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. నవీన్ పొలిశెట్టి మాత్రం ఈ సినిమాతో పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత నవీన్ కాస్త గ్యాప్ తీసుకున్నా ఇక మీదట నో గ్యాప్ అనేలా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ మరోసారి తన మార్క్ ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న హీరోయిన్ గురించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నవీన్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఓకే చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో స్టార్ హీరోయిన్ తో నవీన్ మరోసారి జత కట్టబోతున్నారని చెప్పొచ్చు. నవీన్ అనగనగా ఒక రాజు పెళ్లి హంగామాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు.

Full View
Tags:    

Similar News