నవీన్ పొలిశెట్టి.. ఏం చేస్తున్నాడు?

టాలెంటెడ్ హీరోగా నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్నాడు.

Update: 2024-09-16 05:30 GMT

టాలెంటెడ్ హీరోగా నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్నాడు. అయితే హీరోగా మంచి ఇమేజ్ ఉన్న కూడా నవీన్ పొలిశెట్టి సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కథల ఎంపికలో చాలా సెలక్టివ్ గా నవీన్ వెళ్తున్నారు. వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి గతంలో ఎనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాని పక్కన పెట్టాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఎనౌన్స్ అయ్యింది. ఈ మూవీ టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. తరువాత ఎందుకనో హోల్డ్ లో పడింది. ఈ కథని అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి చేయబోతున్నాడనే ప్రచారం కూడా గతంలో నడిచింది.

‘అనగనగా ఒక రాజు’ హోల్డ్ లో పడటంతో కళ్యాణ్ శంకర్ సితారలో ‘మ్యాడ్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ‘అనగనగా ఒక రోజు’ స్క్రిప్ట్ విషయంలో నవీన్ సంతృప్తికరంగా లేకపోవడం వలన పక్కన పెట్టాడనే టాక్ వినిపించింది. అయితే కళ్యాణ్ శంకర్ మరల స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని మూవీ కచ్చితంగా పట్టాలెక్కుతుందని అందరూ భావించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నవీన్ పోలిశెట్టి యూఎస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఆయ్’ మూవీ దర్శకుడు అంజి మణిపుత్ర దర్శకత్వంలో సినిమాకి నవీన్ పొలిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ 2లో బన్నీవాస్ ఈ సినిమాని నిర్మించబోతున్నారంట. గోదావరి బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ సినిమాని కూడా అంజి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రావొచ్చని టాక్.

అంటే ఇక సితారలో చేయాల్సిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాని నవీన్ పొలిశెట్టి పూర్తిగా పక్కన పెట్టేసాడనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది మేకర్స్ లేదంటే నవీన్ పొలిశెట్టి నుంచి క్లారిటీ వచ్చే వరకు కన్ఫర్మ్ కాదు. ఏది ఏమైనా నవీన్ గాయం నుంచి కోలుకొని ఇండియా వస్తేనే అన్నింటిపై ఒక స్పష్టత వస్తుంది.

Tags:    

Similar News