మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి!
మణిరత్నం ఇటీవలే మళ్లీ తన మార్క్ లవ్ స్టోరీ ఒకటి చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మణిరత్నం ఇటీవలే మళ్లీ తన మార్క్ లవ్ స్టోరీ ఒకటి చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ హీరోగా `థగ్ లైఫ్` తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం మణిరత్నం లవ్ స్టోరీ పట్టాలె క్కుతుంది. ఇప్పటికే స్టోరీ సిద్దమైంది. ఇందులో కొంత మంది కొత్త నటీనటులకు అవకాశం ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. మరి ఆ ఛాన్స్ ఎవరికి వరిస్తుంది? అన్నది పక్కన బెడితే? తెలుగు నుంచి యువ నటుడు నవీన్ పొలిశెట్టిని ఓ పాత్రకు తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సినిమాలో కీలకమైన నాలుగు పాత్రలుంటాయట. అందులో ఓ పాత్ర కోసం నవీన్ పేరును మణిరత్నం పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే నవీన్ జాతకమే మారిపోతుంది. ఇప్పటికే నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా ఎదిగాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పుడున్న యువ నటుల్లో తానో స్పెషల్ అని నిరూపించాడు.
`జాతిరత్నాలు`, `మిస్ పోలిశెట్టి మిస్టర్ పొలిశెట్టి` లాంటి సినిమాలు నవీన్ కి మంచి ఇమేని తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత కొత్త అవకాశాలు అందుకోవడంలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం నవీన్ చేతిలో ఒక సినిమానే ఉంది. అదే `అనగనగా ఒకరోజు `చిత్రం. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇంతలోనే మణిరత్నం కాంపౌండ్ లో నవీన్ అనే వార్త సంచలనంగా మారింది. ఈ అవకాశం నిజమైతే? నటుడిగా నవీన్ మరింత షైన్ అవుతాడు.
నవీన్ కున్న యూత్ ఫాలోయింగ్ కి సరైన లవ్ స్టోరీ పడితే? లవర్ బోయ్ ఇమేజ్ తో తిరుగులేని స్థాయికి వెళ్తాడు. మరి అంతటి అదృష్టం నవీన్ కి ఉందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం మణిరత్నం థగ్ లైఫ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.