చుట్టమల్లె సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్న నయన్ కొడుకులు
ఈ సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర1 సినిమా గతేడాది దసరాకు రిలీజై మంచి హిట్ గా నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిరుధ్ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఈ పాట మీద ఇప్పటికే లక్షల కొద్దీ రీల్స్, వందల సంఖ్యలో కవర్ సాంగ్స్ కూడా వచ్చాయి. అయితే దేవర సినిమా వచ్చి 5 నెలలు దాటుతున్నా, ఇప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ అసలు తగ్గలేదు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార కవలలు చుట్టమల్లె సాంగ్ తమిళ వెర్షన్ పత్తవైక్కుం సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
నయనతార, విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి ఈ పాట వింటూ కారులో వెళ్తుండగా, విఘ్నేష్ మీద కూర్చున్న పిల్లలిద్దరూ ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తూ కనిపించారు. అంతేకాదు, సాంగ్ మధ్యలో వచ్చే ఆహ్.. అని సౌండ్ కూడా చేశారు. అది విని నయన్ వావ్.. ఓ మై గాడ్.. అంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ తన ఫోన్ లో వీడియో తీసింది.
ఇదిలా ఉంటే దేవర మూవీ రిలీజైనప్పుడు ఈ సాంగ్ కు థియేటర్లలో ఆహ్.. అనే సౌండ్ కు ఆడియన్స్ చేసిన రచ్చ చూసి అనిరుధే షాక్ అయ్యాడు. ఇప్పుడదే పాటను నయనతార కొడుకులు హమ్ చేయడం నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే పత్తవైక్కుం సాంగ్ కు లిరిక్స్ రాసింది నయనతార భర్త విఘ్నేష్ శివనే.