నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్.. బ్రేకప్స్ నుంచి ఎమోషనల్ జర్నీ

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.

Update: 2024-11-09 06:59 GMT

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఆమె చేసింది. కెరియర్ ఆరంభం నుంచి అగ్ర హీరోలతో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన నయనతార ఇప్పటికి తన బ్రాండ్ ని కొనసాగిస్తోంది. ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఒరియాంటెడ్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

తమిళంలో సోలోగా ఆమెకి 50 కోట్లకి పైగా మార్కెట్ ఉంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార ఉంది. అయితే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంది. లవ్ ఫెయిల్యూర్ బాధని అనుభవించింది. ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి నెట్ ఫ్లిక్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతోంది .

తాజాగా ఈ ఫిల్మ్ ట్రైలర్ ని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో నయనతార సినిమాలకి సంబందించిన విజువల్స్ హైలెట్ చేశారు. అలాగే స్టార్ సెలబ్రెటీలైన నాగార్జున, రాధిక, నెల్సన్ దిలీప్ కుమార్.. నయనతార గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. తను వ్యక్తిగతంగా జీవితంలో చాలా బాధని అనుభవించిందని నాగార్జున నయనతార గురించి చెప్పారు.

అలాగే నయనతార కూడా తన కెరియర్ లో పేస్ చేసిన స్ట్రగుల్స్, అవమానాలు అన్నింటిని కూడా మనసువిప్పి తెలియజేశారు. ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేయడం తన వీక్ నెస్ అంటూ నయనతార ట్రైలర్ లో చెప్పింది. అలాగే తన లైఫ్ లోకి విగ్నేష్ శివన్ ఎంట్రీ, అతనితో పరిచయం, ప్రేమ, పెళ్లి లాంటి ఘట్టాలు అన్నింటిపైన నయనతార మాట్లాడింది.

విగ్నేష్ శివన్ కూడా నయనతారతో తన పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి డాక్యుమెంటరీలో పంచుకున్నారు. ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తోనే ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించినట్లు ట్రైలర్ తో అర్ధమవుతోంది. నవంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ కాబోతోంది. నయనతార ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Full View
Tags:    

Similar News