కవలలతో నయన్-విఘ్నేష్ సంక్రాంతి వేడుకలు
ఈ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
నయనతార- విఘ్నేష్ శివన్ జంట ప్రేమ పెళ్లి, అన్యోన్య దాంపత్యం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ జంట తమ కవల పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే, సంసార సరిగమల్ని ఆస్వాధిస్తున్నారు. మరోవైపు నయనతార నటిగా కెరీర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికీ అగ్ర కథానాయికగా, బిజీ లైఫ్‌ని కొనసాగిస్తోంది.
అయితే ఎంత బిజీ లైఫ్ ఉన్నా, పండుగల వేళ సెలబ్రేషన్స్ కోసం ఈ అందమైన జంట ఎప్పుడూ ముందుంటుంది. డిసెంబర్ చివరిలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్న నయన్- విఘ్నేష్ జంట ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ ని అంతే వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
ఈ ముచ్చటైన జంట తమ పిల్లలతో పాటు సాంప్రదాయ దుస్తులను ధరించి, చెరకు గడలు పండ్లు ఫలహారాల నైవేద్యంతో పూజలాచరించి చాలా సందడిగా కనిపిస్తున్నారు. పూర్తిగా వైట్ అండ్ వైట్ లుక్ లో పండగకు మారు రూపంలా, శాంతి చిహ్నంలా అందంగా కనిపిస్తోంది ఫ్యామిలీ. ముఖ్యంగా సరోగసి కిడ్స్ తెల్ల పంచెలు, తెల్లచొక్కాలతో పెద్దరికం తెచ్చారు ఫ్రేమ్‌కి. ప్రస్తుతం ఈ అందమైన ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. సకుటుంబ సపరివార సమేతంగా నయన్ సెలబ్రేషన్స్ ఎంతో ముచ్చటగొలుపుతున్నాయంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొత్త సంవత్సరంలో నయన్ అరడజను ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. టెస్ట్, టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్, మన్నంగట్టి, రక్కావీ వంటి చిత్రాల్లో నటిస్తోంది. విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న టైటిల్ లేని చిత్రంలోను నటిస్తోంది.