50 సెక‌న్ల‌కు 5 కోట్లు వ‌సూలు చేసిన‌ న‌టి?

కెరీర్ లో దాదాపు 75 పైగా చిత్రాల్లో న‌టించి అగ్ర క‌థానాయికగా గౌర‌వాన్ని అందుకుంటోంది. సౌత్ నార్త్ లో భారీ ఫాలోయింగ్ పాపులారిటీ ఉన్న న‌టి.;

Update: 2025-03-04 03:49 GMT

కెరీర్ లో దాదాపు 75 పైగా చిత్రాల్లో న‌టించి అగ్ర క‌థానాయికగా గౌర‌వాన్ని అందుకుంటోంది. సౌత్ నార్త్ లో భారీ ఫాలోయింగ్ పాపులారిటీ ఉన్న న‌టి. త‌న అంద‌చందాలు, న‌ట‌ప్ర‌తిభ‌తో ఎప్పుడూ ప్ర‌జ‌ల్ని విస్మ‌య‌ప‌రుస్తుంది. ఈ న‌టి కేవలం 50 సెకన్లకు రూ. 5 కోట్లు వసూలు చేసింది. రూ. 50 కోట్ల ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకుంది. ఇటీవ‌లే 1000 కోట్ల క్ల‌బ్ సినిమాతో హిందీ ఆరంగేట్రాన్ని అద‌ర‌గొట్టింది. ఈ ప్ర‌ముఖ‌ న‌టి ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. ది గ్రేట్ న‌య‌న‌తార గురించే ఈ ప‌రిచ‌యం. సూప‌ర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న న‌య‌న్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర వివ‌రాలు ఇవి.


ద‌శాబ్ధాలుగా అగ్ర క‌థానాయిక హోదాను నిల‌బెట్టుకున్న ఏజ్ లెస్ బ్యూటీగా నయనతార పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. తనదైన అందం, ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో అద్భుత‌మైన‌ కెరీర్‌ను నిర్మించుకున్న న‌య‌న‌తార‌ తమిళం, తెలుగు, మలయాళ భాష‌ల‌లో 75 కి పైగా సినిమాల్లో నటించి భారీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. టీవీ హోస్ట్ గా కెరీర్ ప్రారంభించి అగ్ర క‌థానాయిక హోదాను అందుకుంది.

నయనతార 2003లో మలయాళ చిత్రం `మనస్సినక్కరే`తో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయ్య, చంద్రముఖి, గజిని, బాడీగార్డ్, సూపర్ (మ‌ల‌యాళం) వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. త‌నదైన‌ అందం, ఆకర్షణీయమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో `లేడీ సూపర్‌స్టార్` అనే బిరుదును సంపాదించింది. అదే స‌మ‌యంలో బాక్సాఫీస్ వ‌ద్ద న‌మ్మ‌ద‌గిన క్వీన్ గా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న‌ `జవాన్‌` చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం చారిత్రాత్మక విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్-ఇండియన్ స్టార్‌గా న‌య‌న్ త‌న‌ హోదాను సుస్థిరం చేసుకుంది.

నయనతార కు ఉన్న గొప్ప ప్రజాదరణ , ఫాలోయింగ్ దృష్ట్యా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి భారీగా ఆర్జిస్తోంది. శాటిలైట్ డిష్ కనెక్షన్ ప్రకటనలో కేవలం 50 సెకన్ల పాటు కనిపించడానికి న‌య‌న్ ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందని క‌థ‌నాలొచ్చాయి. దీంతో దేశంలో అత్యధిక పారితోషికం పొందే నటీమణులలో ఒకరిగా న‌య‌న్ పేరు మార్మోగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న నయనతార న‌టిగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించ‌డంలోనే కాదు.. నిక‌ర ఆస్తులు కూడ‌గ‌ట్ట‌డంలోను స్పీడ్ మీద ఉంది. న‌య‌న్ ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుంది. న‌య‌న్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 200 కోట్లు. నేటి స్టార్ల‌లో విలాసవంతమైన జీవనశైలితో క్వీన్ అని నిరూపిస్తోంది. సుమారు రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ను కూడా న‌య‌న్ సొంతం చేసుకుంది. భ‌ర్త విఘ్నేష్ తో క‌లిసి ఇంత‌కుముందు ఈ ప్ర‌యివేట్ జెట్ లో విహార‌యాత్ర‌ల‌ను ఆస్వాధించింది. ఆక‌స్మిక ప్రయాణాలకు దీనిని ఉపయోగిస్తుంది.

ఏడాది కాలంగా న‌యన్ రిలాక్స్ డ్ మోడ్ లో ఉంది. ప్ర‌స్తుతం నాలుగు చిత్రాల‌తో బిజీగా ఉంది. మన్నంగట్టి సిన్స్ 1960, టాక్సిక్, కిస్, రాకాయి వంటి భారీ చిత్రాల‌లో న‌టిస్తోంది. సూప‌ర్ స్టార్ గా త‌లైవిగా గౌర‌వం అందుకున్న న‌య‌న‌తార‌ను `ది రీనైనింగ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా` అని గౌర‌విస్తారు. న‌య‌న్ నిజంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు ఎందుకు అర్హురాలో పదే పదే నిరూపిస్తూనే ఉంది.

Tags:    

Similar News